అల్లుడు.. సవ్యసాచి.. ఎంత తేడా?

అల్లుడు.. సవ్యసాచి.. ఎంత తేడా?

అక్కినేని నాగచైతన్య కెరీర్లో హిట్లన్నీ లవ్ స్టోరీలు.. ఫ్యామిలీ ఎంటర్టైనర్లే. ఐతే అతడికి మాత్రం మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ఆశ. ఇందుకోసం యాక్షన్ సినిమాలు చాలానే ట్రై చేశాడు. కానీ అలా ట్రై చేసిన ప్రతిసారీ ఎదురు దెబ్బే తగిలింది. దడ.. ఆటోనగర్ సూర్య.. దోచేయ్.. యుద్ధం శరణం.. ఇలా అతను చేసిన యాక్షన్ సినిమాలు చాలా వరకు నిరాశ పరిచాయి.

ఈ జాబితాలోకి కొత్తగా చేరింది ‘సవ్యసాచి’. చైతూ కెరీర్లో మంచి మలుపు అవుతుందని.. అతడిని యాక్షన్ హీరోగా నిలబెడుతుందని.. కెీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని.. ఇలా ‘సవ్యసాచి’ విషయంలో అక్కినేని అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. బ్యాడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్లో నిలవడమే కష్టంగా ఉంది. ఇక వీకెండ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.

చైతూ నుంచి చివరగా వచ్చిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆ చిత్రానికి మంచి హైప్ వచ్చింది. తొలి రోజు ఈ చిత్రానికి రూ.7 కోట్ల షేర్ రావడం విశేషం. ఐతే ‘సవ్యసాచి’కి తొలి రోజు వచ్చిన షేర్ రూ.4.15 కోట్లు మాత్రమే. ‘శైలజారెడ్డి అల్లుడు’కి ఎంత వినాయక చవితి సెలవు కలిసొచ్చినప్పటికీ ఆ చిత్రానికి తొలి రోజు వచ్చిన వసూళ్లు అనూహ్యం. ఆ చిత్రానికి కూడా టాక్ బ్యాడ్‌గా ఉన్నప్పటికీ వీకెండ్ అంతా నిలకడగా వసూళ్లు వచ్చాయి.

‘సవ్యసాచి’ విషయంలో అలా జరగలేదు. వసూళ్లు రెండో రోజుకే డ్రాప్ అయ్యాయి. చైతూ ఇంతకుముందు చేసిన యాక్షన్ మూవీస్ ‘దోచేయ్’.. ‘యుద్ధం శరణం’లకు కూడా ఓపెనింగ్స్ దారుణంగా వచ్చాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘సవ్యసాచి’ కూడా తేడా కొట్టేసిన నేపథ్యంలో చైతూ ఇకనైనా తన బలాన్ని గుర్తించి లవ్ స్టోరీలు.. ఫ్యామిలీ ఎంటర్టైనర్లకే పరిమితం అవుతాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English