మా హీరోయిన్ మొహం పెట్టి అమ్మేస్తున్నారమ్మా!

మా హీరోయిన్ మొహం పెట్టి అమ్మేస్తున్నారమ్మా!

ఇది జస్ట్ అన్యాయం కాదండోయ్. అన్యాయం టూ ది కోర్. ఇప్పుడు హాలీవుడ్ అవకాశం వచ్చిందని సంతోషపడాలా? లేదంటే అసలు ఇవన్నీ కేవలం ఇలా కళ్ళు మూస్తే అలా మిస్సయ్యే మెరుపుతీగ వంటి ఛాన్సులే అని బాధ పడాలో అర్దంకాని పరిస్థితి. క్వాంటికో టివి సీరియల్ తో హాలీవుడ్లో అడుగుపెట్టిన మన ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గురించే ఈ డిస్కషన్లన్నీ.

నిజానికి హాలీవుడ్ సినిమాలో చేస్తుందని చెప్పగానే మనోళ్లు చాలామంది బాగా ఆనందించేశారు. కాని దురదృష్టం ఏంటంటే.. ఆమెను బే వాచ్ వంటి సినిమాలో కూడా కేవలం చిన్నపాటి పాత్రకే పరిమితం చేశారు. అదే బాలీవుడ్లో అలాంటి పాత్రలు ఇస్తే మాత్రం చచ్చినా చేయని ప్రియాంక.. హాలీవుడ్ అనే సరికి కాస్త ఎగబడుతోందిలే. ఇప్పుడు అమ్మడు 'ఈజింట్ ఇట్ రొమాంటిక్‌' అనే సినిమాతో మరోసారి హాలీవుడ్లో అలజడి సృష్టించనుంది. అలజడి అని మనం అనుకుంటున్నాం కాని.. ఆ సినిమా ట్రైలర్లో ఆమె కేవలం రెండే రెండు షాట్లలో ఉంది. ట్రైలర్ తాలూకు యుట్యూబ్ హెడ్డింగులో ప్రియాంక చోప్రా పేరు మొదటనే ఉన్నా.. సినిమా అంతా కూడా రెబెల్ విల్సన్ అనే అమ్మాయిదే. హెడ్డింగులో మరియు థంబ్ నెయిల్ లో ప్రియాంక మొహం పెట్టేసి మనకు సినిమాను అమ్మేస్తున్నారంతే.

ఇకపోతే ప్రియాంక కూడా ఇలా కనిపించి అలా మాయమైపోయే పాత్రలను ఎందుకు చేస్తుందో ఆమెకే తెలియాలి. బహుశా అలాగైనా కొన్నాళ్ళకి హాలీవుడ్లో ఏదో ఒక సినిమాలో మెయిన్ లీడ్ అవకాశం వస్తుందని కాబోలు. అక్కడ చాలామంది 40 ఏళ్ళు వచ్చాక కూడా మెయిన్ హీరోయిన్లు అవుతుంటారు. మన డస్కీ బ్యూటి కూడా ఆ తరహాలోనే థింకింగ్ అనమాట!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English