ఆమెని తొక్కేసిన రజనీకాంత్‌ అండ్‌ కో!

ఆమెని తొక్కేసిన రజనీకాంత్‌ అండ్‌ కో!

'2.0' రిలీజ్‌ అయితే తన జాతకం మారిపోతుందని, భారీ సినిమాలు, అగ్ర హీరోలు వచ్చి తన కోసం క్యూ కడతారని, అది రిలీజ్‌ అయ్యేవరకు ఏ సినిమా ఒప్పుకోకుండా కాలక్షేపం చేస్తోంది ఏమీ జాక్సన్‌. ఇంతకుముందు ఐ, ఎవడు తదితర చిత్రాల్లో కనిపించిన ఈ బ్రిటిష్‌ సుందరి '2.0' షూటింగ్‌ పూర్తి చేసుకుని ఏడాదికి పైగా గడిచిపోయింది. అయినా కానీ ఈ టైమ్‌లో తనకి ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ కాదనేసింది. '2.0' ట్రెయిలర్‌ వస్తోందని సోషల్‌ మీడియాలో మిగతా బృందం కంటే ఎక్కువ సందడి చేస్తూ వచ్చింది.

తీరా పోయి చూస్తే ట్రెయిలర్‌ మొత్తం మీద ఏమీ కనిపించింది మూడు సెకన్ల పాటు మాత్రమే. పూర్తిగా అక్షయ్‌, రజనీకాంత్‌ మీదే శంకర్‌ ఫోకస్‌ అంతా వుంది. దీంతో ఏమీకి సరయిన స్కోప్‌ దొరకలేదు. అత్యంత సెక్సీ సుందరిగా పేరు తెచ్చుకున్న ఏమీ ఇందులో రోబో కాస్టూమ్స్‌లో కనిపిస్తుంది కనుక ఇక తన సెక్సప్పీల్‌ కూడా పెద్దగా వుండదు. మరి ట్రెయిలర్‌లోనే ఏమీని తొక్కేసారా లేక సినిమాలోను ఆమె పాత్ర కరివేపాకులానే వుంటుందా అనేది తెలీదు. ఇందులో పాటలు కూడా ఎక్కువ లేవు కనుక ఏమీకి ఆ ఆనందం కూడా లేదు. 'రోబో' చిత్ర ప్రచారంలో ఐశ్వర్యారాయ్‌కి సమ ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఈ చిత్రానికి మాత్రం పాపం ఏమీ ఆశలు పెట్టుకున్న దాంట్లో కనీసం పదోవంతు అయినా కవరేజ్‌ ఇవ్వడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English