గుడ్లు తేలేసిన సవ్యసాచి!

గుడ్లు తేలేసిన సవ్యసాచి!

మొదటి రోజు వసూళ్ల పరంగా సవ్యసాచి రికార్డులేమీ సాధించలేదు. మూడు కోట్ల షేర్‌తో నాగ చైతన్య చిత్రాల్లో మూడవ బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ తెచ్చుకుందంతే. చైతన్య గత చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు' తొలి రోజు చైతన్య సినిమాల్లో రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వసూళ్ళు బాగా డ్రాప్‌ అయి ఫైనల్‌గా సినిమా ఫ్లాప్‌ అయిపోయిందనుకోండి... అది వేరే సంగతి.

తొలి రోజు మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న సవ్యసాచికి ఏ సెంటర్స్‌లో ఫస్ట్‌ డే కలక్షన్స్‌ డీసెంట్‌గానే వచ్చాయి. అయితే రెండవ రోజు మార్నింగ్‌ షో కే సినిమా గుడ్లు తేలేసేసింది. మార్నింగ్‌ షోస్‌కి కాస్త డ్రాప్‌ సహజమే అయినా సవ్యసాచి వసూళ్లు గణనీయంగా పడిపోయాయి. శనివారం సాయంత్రానికి అయినా వసూళ్ళు పుంజుకోని పక్షంలో భారీ నష్టాలని బయ్యర్లు చవిచూడాల్సి వస్తుంది. నాగచైతన్య మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని ఇరవై మూడు కోట్ల రేంజిలో అమ్మారు.

సెకండ్‌ వీక్‌లో చాలా సినిమాల నుంచి పోటీ వుంటుంది కనుక సవ్యసాచి ఎంత సాధించినా ఈ వీకెండ్‌లోనే రాబట్టుకోవాలి. ఇలా వసూళ్ల పరంగా ఇప్పుడే ఇంత డ్రాప్‌ అయిపోతే సేఫ్‌ జోన్‌కి చేరడం కష్టమైపోతుంది. మ్యాట్నీ, ఫస్ట్‌ షోలకి ఈ చిత్రం పుంజుకుంటుందని బయ్యర్లు ఆశ పడుతున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English