రజనీకాంత్‌ అయితే ఏంటి, బాలకృష్ణ ఇక్కడ!

రజనీకాంత్‌ అయితే ఏంటి, బాలకృష్ణ ఇక్కడ!

రజనీకాంత్‌ సినిమా అనగానే కన్ను, మిన్ను కానకుండా రైట్స్‌ కోసం ఎగబడిపోయే రోజులు పోయాయి. ముఖ్యంగా తెలుగునాట రజనీ సినిమాకి వసూళ్లు బాగా తగ్గాయి. శంకర్‌లాంటి దర్శకుడితో చేస్తే రజనీకి మన అగ్ర హీరోలతో సమానమైన ఆదరణ వుంటుంది కానీ పేరు తెలియని తమిళ దర్శకులతో చేసినపుడు రజనీ సినిమాలు ఇక్కడ అస్సలు ఆడడం లేదు.

అందుకేనేమో రజనీకాంత్‌ సినిమా 'పెట్టా' సంక్రాంతికి వస్తోందంటే దాని అనువాద హక్కుల కోసం ఎవరూ ఎక్కువగా పోటీ పడడం లేదు. సంక్రాంతికి బాలకృష్ణ నటిస్తోన్న 'ఎన్టీఆర్‌' బయోపిక్‌తో పాటు చరణ్‌-బోయపాటి సినిమా ప్లస్‌ వెంకీ-వరుణ్‌తేజ్‌ల 'ఎఫ్‌ 2' వస్తున్నాయి. ఇన్ని పెద్ద సినిమాలతో థియేటర్లన్నీ నిండిపోతాయి. ఇక ఓ అనువాద చిత్రానికి థియేటర్లు దొరికే పరిస్థితి వుండదు.

అందునా 'పెట్టా' కూడా 'కాలా' మాదిరిగా కనిపిస్తూ వుండడం, తమిళ యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఇది రూపొందడం వల్ల ఇక్కడ క్రేజ్‌ లేదు. అనువదించినా కానీ తమిళంతో పాటు తెలుగులో పెట్టా సైమల్టేనియస్‌గా రిలీజ్‌ అయ్యే ప్రసక్తే లేదు. '2.0' పెద్ద హిట్‌ అయి, మళ్లీ రజనీ సినిమాకోసం బయ్యర్లు అర్రులు చాస్తే తప్ప 'పెట్టా' ఇక్కడ కూడా ఒకేసారి రిలీజ్‌ కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English