2.0: ఇది శంకర్‌ మార్కు విప్లవం

2.0: ఇది శంకర్‌ మార్కు విప్లవం

రాజమౌళి, శంకర్‌ ఇద్దరూ ఇండియన్‌ సినిమాని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకు వెళ్లాలని పరితపించే వారే. రాజమౌళి మన ఇండియన్‌ రూట్స్‌ వున్న కాస్టూమ్‌ డ్రామాలని కళ్లు చెదిరేలా ప్రెజెంట్‌ చేస్తే, శంకర్‌ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించే యాక్షన్‌ అడ్వెంచర్స్‌కి ధీటైన చిత్రాన్ని 2.0తో అందిస్తున్నాడు.

ఎత్తయిన ఆకాశ హర్మ్యాలు నేలమట్టం కావడం, జయంట్‌ సైజ్‌ వున్న ప్రాణులు కొట్టుకుంటూ మహాసంగ్రామాన్ని తలపించడం చాలా హాలీవుడ్‌ సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించే సీన్లు. అలాంటి సినిమాలు హాలీవుడ్‌కే పరిమితం అన్నట్టు వేరే దేశాల వారు కూడా వాటి జోలికి అంతగా పోరు. కానీ రిస్ట్రిక్ట్రెడ్‌ బడ్జెట్‌ వున్నా, హాలీవుడ్‌ మాదిరిగా అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టే వెసులుబాటు లేకున్నా, మన మార్కెట్‌ ఎన్నో రెట్లు చిన్నది అయినా అలాంటి చిత్రాన్ని మన ప్రేక్షకులకి అందించే కల కన్నాడు శంకర్‌.

'2.0' కథాంశం జోలికి అప్పుడే వెళ్లడం భావ్యం కాదు కానీ ఒక పక్షి ఆకారంలో వున్న విలన్‌ సృష్టించే ప్రళయాన్ని అడ్డుకునేందుకు సూపర్‌ పవర్‌గా రజనీకాంత్‌ అవతరిస్తాడు. ఈ ఇద్దరూ కలిసి బీభత్సమైన పోరాటానికి దిగుతారు. అక్షయ్‌కుమార్‌ విలన్‌ పాత్రని పోషించగా, రజనీకాంత్‌ మళ్లీ రోబో చిట్టిగా కనిపిస్తున్నాడు. చివరకు చెడుపై మంచి గెలుస్తుందనేది తెలిసిన సంగతే అయినా ఈ ఇద్దరూ కలిసి పోరాడే ఆ భీతావహ దృశ్యాలని ట్రెయిలర్లో చూచాయగా చూపించారు.

ఇండియన్‌ స్క్రీన్‌పై ఇంతకుముందు వీక్షించని అద్భుతాన్ని శంకర్‌ ఆవిష్కరించాడనేది సుస్పష్టం. ఇక ఈ చిత్రం మన ప్రేక్షకులని ఎంతగా అబ్బుర పరుస్తుంది, ఏ స్థాయిలో సంచలనం చేస్తుందనే దాని కోసమే వేచి వుందాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English