సర్కార్ స్టోరీ వివాదం.. ఆయన రాజీనామా

సర్కార్ స్టోరీ వివాదం.. ఆయన రాజీనామా

ముగిసిందనుకున్న ‘సర్కార్’ స్టోరీ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన దక్షిణ భారత రచయితల సంఘం అధ్యక్షుడు భాగ్యరాజ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ వివాదాన్ని పరిష్కరించే క్రమంలో తాను ‘సర్కార్’ కథను బయట పెట్టేశానని.. ఇది నైతికంగా సరైన పని కాదని.. అందుకు బాధ్యత వహిస్తూ తాను తన పదవికి రాజీనామా చేస్తున్నానని భాగ్యరాజ్ తెలిపాడు.

తాను 2007లో రాసిన ‘సెంగల్’ అనే కథను కాపీ కొట్టి మురుగదాస్ ‘సర్కార్’ సినిమా తీశాడంటూ వరుణ్ రవీంద్రన్ అనే రచయిత ఆరోపించిన సంగతి తెలిసిందే. అతను తన కథతో భాగ్యరాజ్ దగ్గరికి వెళ్లి కలవగా.. ‘సర్కార్’ కథను, దీన్ని పరిశీలించి రెండింట్లో పోలికలు ఉన్నాయని ఆయన గుర్తించారు. ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. ముందు ఈ ఆరోపణల్ని మురుగదాస్ తీవ్రంగా ఖండించాడు. భాగ్యరాజ్ మీద కూడా విమర్శలు చేశాడు. కానీ వివాదం రోజు రోజుకూ పెద్దది అవుతుండటంతో తర్వాత రాజీకి వచ్చాడు. అనుకోకుండా ఇద్దరికీ ఒకే ఐడియా వచ్చి ఉండొచ్చని.. వివాదాన్ని పరిష్కరించడం కోసం ‘సర్కార్’ టైటిల్ క్రెడిట్స్‌లో వరుణ్ పేరు కూడా వేస్తామని ప్రకటించాడు.

అంతటితో గొడవ సద్దుమణిగిందనే అంతా అనుకున్నారు. ఐతే ఒక దశలో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లేలా కనిపించిందని.. ఇరు వర్గాలూ రాజీకి రాలేదని.. ఆ సమయంలో తాను ‘సర్కార్’ కథను తాను బయట పెట్టాల్సి వచ్చిందని.. తాను ఏ ఉద్దేశంతో చేసినప్పటికీ ఇది తప్పని.. అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నానని.. ‘సర్కార్’ నిర్మాణ సంస్థ ‘సన్ పిక్చర్స్’కు కూడా తాను సారీ చెప్పానని భాగ్యరాజ్ వెల్లడించాడు. ఐతే భాగ్యరాజ్ రాజీనామాను తాము ఆమోదించమని సంఘం ప్రతినిధి ఒకరు చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English