గూబ పగిలేలా బదులిచ్చిన సూపర్‌స్టార్‌!

గూబ పగిలేలా బదులిచ్చిన సూపర్‌స్టార్‌!

వరుస ఫ్లాపులతో సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ మార్కెట్‌ చాలా దెబ్బ తినేసింది. అతని సినిమాలకి ఇండియాలో వంద కోట్ల నెట్‌ వసూళ్ళు రావడం కూడా గగనమైపోయింది. దీంతో షారుక్‌ పని అయిపోయిందని, సల్మాన్‌, అమీర్‌ మాదిరిగా అతను తన ఉనికి నిలుపుకోలేడని మీడియా అతడిని జీరోలా చూడడం స్టార్ట్‌ చేసింది. ఏమనుకున్నాడో ఏమో తన సినిమాకి 'జీరో' అనే టైటిల్‌ పెట్టి ఊహించని విధంగా మరుగుజ్జు పాత్ర పోషించాడు. ఆది నుంచి ఆసక్తి కలిగిస్తోన్న ఈ చిత్రం ట్రెయిలర్‌ ఈరోజు రిలీజ్‌ అయింది. మరుగుజ్జు పాత్రతో ఏమి చేసారనేది దర్శకుడు క్లారిటీ ఇచ్చేసాడు.

జీరోగా చూస్తోన్న వారికి తాను కూడా ఓ అమ్మాయిని గెలవగలను అని చూపించడానికి బయలు దేరిన హీరో ఒక వికలాంగురాలితో (అనుష్క శర్మ) సెటిల్‌ అయిపోతాడు. గంతకి తగ్గ బొంత అనుకుంటాడు. కానీ అలా తనకి తగ్గ మనిషిని చూసుకుంటే గొప్పేమిటని భావించి ఒక స్టార్‌ హీరోయిన్‌ని (కత్రినా కైఫ్‌) ముగ్గులో దించుతాడు. కానీ ఒక రోజు ఆమె అతడిని జీరో అంటూ రోడ్డు మీదకి గెంటేస్తుంది. అప్పుడతను ఏం చేస్తాడు? ఇలాంటి ఆసక్తికరమైన కథాంశమున్న ఈ ట్రెయిలర్‌కి రెస్పాన్స్‌ అదిరిపోతోంది. ఆల్రెడీ అయిదు మిలియన్‌ వ్యూస్‌కి దగ్గరవుతోన్న ఈ ట్రెయిలర్‌కి కొన్ని గంటల్లోనే అయిదు లక్షల లైక్స్‌ కూడా వచ్చాయి. ఒక సినిమాకున్న క్రేజ్‌ని అంచనా వేయడానికి ఇంతకంటే కొలమానం అక్కర్లేదు. సినిమా రిజల్ట్‌ ఎలా వుంటుందనేది తర్వాతి విషయం. ఈసారి ఓపెనింగ్స్‌తో మాత్రం కింగ్‌ ఖాన్‌ తనని జీరో అన్నవారికి గూబ పగిలే ఆన్సర్‌ ఇవ్వడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English