ఇలియానాకి ఇంకా సీనుందా?

ఇలియానాకి ఇంకా సీనుందా?

ఎప్పుడో గాయబ్‌ అయిపోయిన గోవా సుందరి ఇలియానా మళ్లీ 'అమర్‌ అక్బర్‌ ఆంటొని'తో తిరిగి తెలుగు తెరపై కనిపించనుంది. టీజర్‌లో ఇలియానా షాట్స్‌ చాలానే వున్నాయి కానీ ఆమెలో మునుపటి స్పార్క్‌ లేదనే కామెంట్లు పడుతున్నాయి.

ఇదివరకు ఇలియానా అలా కనిపిస్తే 'వాహ్‌' అంటూ కుర్రకారు సోషల్‌ మీడియాలో ఆ స్నాప్‌ షాట్స్‌తో సందడి చేసేది. మీడియా అయితే ఇలియానా ప్రతి ఫోటోకీ కవిత్వాలు రాసేసేది. కానీ 'అమర్‌ అక్బర్‌ ఆంటొని'లో ఇన్నేళ్ల తర్వాత కనిపించినా కానీ ఇలియానా టాపిక్కే లేదెక్కడా. అప్పటి ఛార్మ్‌ అయితే ఆమెలో లేదనేదే బాగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదల తర్వాత మళ్లీ తెలుగునాట బిజీ కాగలనని ఆశిస్తోన్న ఇలియానా ఆశలు తీరే అవకాశముందా?

ఈ చిత్రంలో నటించేందుకు ఆమె బాగా పారితోషికం డిమాండ్‌ చేసిందని, వేరే హీరోయిన్‌ లేక నిర్మాతలు ఆమె అడిగింది చెల్లించేసారని సమాచారం. అయితే ఈ సినిమాకి కనుక ఇలియానా ఎలాంటి ప్రత్యేక ఆకర్షణ కాలేకపోతే ఇక తన డిమాండ్లు చెల్లేందుకు లేదు అవకాశం. అసలే బాలీవుడ్‌లో కూడా ఛాన్స్‌లు లేవు కనుక ఈ చిత్రంతో క్లిక్‌ కాలేకపోతే ఇక ఫోటోగ్రాఫర్‌ బాయ్‌ఫ్రెండ్‌తో లైఫ్‌లో సెటిల్‌ అయ్యే ఆలోచనలో పడుతుందేమో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English