త్రివిక్రమ్‌ సినిమా యాడ్‌కే పరిమితం

త్రివిక్రమ్‌ సినిమా యాడ్‌కే పరిమితం

గత యేడాది వెంకటేష్‌ పుట్టినరోజుకి హారిక హాసిని సంస్థ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. దాంతోనే త్రివిక్రమ్‌, వెంకీ కాంబినేషన్‌లో సినిమా ఖాయమనేది తెలిసింది. అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్‌ చేసేది వెంకటేష్‌ సినిమాయేనని ప్రచారమైంది. అయితే త్రివిక్రమ్‌ ఖాళీ అవడం కోసం కాచుకుని కూర్చున్న అల్లు అర్జున్‌తో మలి చిత్రం చేయడానికి త్రివిక్రమ్‌ నిర్ణయించుకోవడంతో వెంకటేష్‌ సినిమా మరోసారి వాయిదా పడింది.

అంటే ఈ చిత్రం పూర్తయ్యే వరకు వెంకటేష్‌తో త్రివిక్రమ్‌ సినిమాకి ముహూర్తం కుదరదు కాబట్టి ఈసారి కూడా వెంకటేష్‌ పుట్టినరోజుకి (డిసెంబరు 13) హారిక హాసిని వాళ్లు ఈ కాంబినేషన్‌ని బర్త్‌డే పోస్టర్‌కే పరిమితం చేసే అవకాశముంది. వెంకటేష్‌కి సోలో హీరో ప్రాజెక్టులు అంత ఈజీగా కుదరడం లేదెందుకో.

అతనితో తేజ 'ఆట నాదే వేట నాదే' అనే సినిమా మొదలు పెట్టి కూడా ఆపేసాడు. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌తో కలిసి 'ఎఫ్‌ 2' చేస్తోన్న వెంకటేష్‌ త్వరలో నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ'లో కనిపించబోతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English