అయోమయం సవ్యసాచి!

అయోమయం సవ్యసాచి!

సవ్యసాచి చిత్రాన్ని ఏ విధంగా ప్రమోట్‌ చేయాలనే విషయంలో నిర్మాతలు, దర్శకుడు విపరీతమైన అయోమయానికి గురవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మొదట్నుంచీ యాక్షన్‌ సినిమాగానే ప్రమోట్‌ చేస్తూ వచ్చారు. అయితే నాగచైతన్యకి యాక్షన్‌ సినిమాల పరంగా ట్రాక్‌ రికార్డ్‌ సరిగ్గా లేదని మీడియా ఊదరగొట్టడం, దానికి తోడు ఈ చిత్రానికి విడుదలకి ముందు అసలు క్రేజ్‌ రాకపోవడంతో ప్రమోషన్స్‌ స్టయిల్‌ మార్చారు.

యాక్షన్‌ని పక్కనపెట్టి తల్లి సెంటిమెంట్‌ని, రొమాన్స్‌ని హైలైట్‌ చేయాలని చూసారు. అయినప్పటికీ క్రేజ్‌ పరంగా ఎలాంటి మార్పు లేదు. దీంతో చివరి అస్త్రంగా కామెడీ ట్రెయిలర్స్‌ కూడా వదులుతున్నారు. చైతన్య అర్జునుడి గెటప్‌లో, వెన్నెల కిషోర్‌ కృష్ణుడి గెటప్‌లో వున్న టీజర్‌ ఏమంత ఆకట్టుకోలేదు. పౌరాణిక గెటప్‌లో చైతన్య కామెడీ కోసం స్ట్రగుల్‌ అయినట్టే కనిపిస్తున్నాడు.

ఎలాగైనా ఈ చిత్రంపైకి ప్రేక్షకుల దృష్టి తిప్పుకోవడం కోసం ఇన్ని రకాలుగా ప్రమోట్‌ చేస్తూ మొదట్నుంచీ ఈ చిత్రంలో యాక్షన్‌ బాగుంటుందని ఎదురు చూస్తూ వచ్చిన ఆడియన్స్‌ని కూడా ఇప్పుడు కన్‌ఫ్యూజ్‌ చేసి పారేసారు. ఇప్పుడు సవ్యసాచి ఏ తరహా చిత్రమనేది ఈ ప్రోమోల వల్ల అర్థం కావడం లేదు. ఇక ఈ చిత్రం విజయావకాశాలన్నీ రేపు స్క్రీన్‌ అయ్యే మొదటి షోకి వచ్చే పబ్లిక్‌ టాక్‌ మీదే డిపెండ్‌ అవుతుంది.   

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English