ఆ మూవీని 48 గంట‌లు నాన్ స్టాప్ గా ఆడించ‌నున్నారు

ఆ మూవీని 48 గంట‌లు నాన్ స్టాప్ గా ఆడించ‌నున్నారు

టాలీవుడ్‌లో మొన‌గాడు హీరో అంటే మొన్న‌టివ‌ర‌కూ ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇప్పుడు వెంట‌నే చెప్పే ప‌రిస్థితి లేదు. టాలీవుడ్ సంగ‌తి అలా ఉంటే కోలీవుడ్ లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంతే. కానీ.. ర‌జ‌నీ స్థాయిలో అభిమానుల్ని సొంతం చేసుకున్న స్టార్ క‌థానాయ‌కుడు ఎవ‌రంటే విజ‌య్ గా చెప్పాలి.

అత‌గాడికి త‌మిళ‌నాడులోనే కాదు.. కేర‌ళ‌లోనూ మాంచి ఫాలోయింగ్ ఉంది.తెలుగులో విజ‌య్ కున్న ఇమేజ్ తో పోలిస్తే..  కేర‌ళ‌లోనే ఎక్కువ‌. ఆ మాట‌కు వ‌స్తే.. ప్ర‌పంచ వ్యాప్తంగానూ విజ‌య్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీపావ‌ళి కానుక‌గా అత‌డు న‌టించిన స‌ర్కార్ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. అయితే.. ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా కేర‌ళ‌లోని ఒక థియేట‌ర్లో నాన్ స్టాప్ గా 24 గంట‌ల పాటు ఆ సినిమాను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

ఒక షో త‌ర్వాత మ‌రో షో చొప్పున 24 గంట‌ల పాటు నాన్ స్టాప్ గా ర‌న్ చేయ‌నున్నారు.  ఈ నెల ఆరున విడుద‌ల కానున్న ఈ సినిమాను త్రిసూర్ లోని కార్తీక థియేట‌ర్లో బ్యాక్ టు బ్యాక్ అన్న‌ట్లు 24 గంట‌ల పాటు నిర్విరామంగా షోలు వేయ‌నున్నారు. కేర‌ళ‌లోనే ఇంత హ‌డావుడి చేస్తే.. చెన్నైలో ఊరుకుంటారా?  రోహిణి థియేట‌ర్ యాజ‌మాన్యం.. స‌ర్కార్ మూవీని 48 గంట‌ల పాటు నాన్ స్టాప్ గా షోలు వేయాల‌ని ప్లాన్ చేస్తోంది. దీనికి అధికారిక అనుమ‌తులు రావ‌టం మిగిలి ఉంది.

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల అవుతున్న ఈ మూవీని దాదాపు 1200 విదేశీ స్క్రీన్ల మీద ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా న‌టిస్తే.. న‌టుడు శ‌ర‌త్ కుమార్ కుమార్తె క‌మ్ న‌టి వ‌ర‌ల‌క్ష్మి కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. రిలీజ్ కు ముందే భారీ అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్న ఈ సినిమాలో విజ‌య్ ఐటీ ఇంజ‌నీర్ గా క‌నిపించ‌నున్నారు. మ‌రి.. రిలీజ్ త‌ర్వాత ఈ మూవీ ఎన్ని రికార్డుల్ని సృష్టిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English