2.0 చివరికి వాళ్ల చేతికి..

2.0 చివరికి వాళ్ల చేతికి..

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే చెలగాటమే. ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే లాభాలు ఏ స్థాయిలో వస్తాయో ఏమో కానీ.. టాక్ తేడా వస్తే మాత్రం నష్టాలు భారీగా ఉంటాయి. గత దశాబ్దంన్నర కాలంలో రజనీ నటించిన సినిమాల్లో ‘చంద్రముఖి’.. ‘శివాజీ’.. ‘రోబో’ మాత్రమే బాగా ఆడాయి. లాభాలు తెచ్చిపెట్టాయి. మిగతా సినిమాలన్నీ బయ్యర్లను ముంచేసినవే. ముఖ్యంగా ఆయన చివరి రెండు సినిమాలు ‘కబాలి’.. ‘కాలా’ బయ్యర్లను బాగా దెబ్బ తీశాయి. దీంతో ‘2.0’ మీద వేలం వెర్రిగా పెట్టుబడి పెట్టడానికి బయ్యర్లు ముందుకు రాలేదు. ఈ చిత్ర తెలుగు హక్కుల కోసం రూ.80 కోట్లకు పైగా లైకా ప్రొడక్షన్స్ ఆశించినట్లు వార్తలొచ్చాయి. ఏషియన్ సినిమాస్ వాళ్లు ఆ రేటుకు సినిమాను కొన్నట్లు కూడా చెప్పుకున్నారు. కానీ నిజానికి ఆ డీల్ ఓకే కాలేదని సమాచారం. మధ్యలో వేరే సంస్థలతోనే లైకా వాళ్లు చర్చలు జరిపారు.

కానీ ఏ డీల్ తెగలేదు. ‘2.0’ విడుదలకు నెల రోజులు కూడా సమయం లేని నేపథ్యంలో అసలు దీని హక్కులు ఎవరికి దక్కుతాయా అన్న ఉత్కంఠ పెరిగిపోతుండగా.. ఎట్టకేలకు డీల్ సెట్టయినట్లు వెల్లడైంది. ‘స్పైడర్’ సినిమాను నిర్మించిన ఎన్వీఆర్ సినిమా ‘2.0’ తెలుగు హక్కులు దక్కించుకుంది. ఈ బేనర్ మీద ఎన్వీ ప్రసాద్ సినిమాలు నిర్మించడంతో పాటు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ వాళ్లతో కలిసి ‘కణం’.. ‘కాలా’ సినిమాల్ని తెలుగులో అందించింది ఆయనే. ‘2.0’ హక్కుల్ని మొత్తంగా కొనేయకుండా.. లైకా వాళ్ల భాగస్వామ్యంతో ఆయన రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్లో పట్టున్న ప్రసాద్ సాయంతో లైకా వాళ్లే సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తున్నట్లు లెక్క.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English