పవన్‌కళ్యాణ్‌ తిరిగి వచ్చేస్తాడనే నమ్మకం

పవన్‌కళ్యాణ్‌ తిరిగి వచ్చేస్తాడనే నమ్మకం

పవన్‌ కళ్యాణ్‌ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు కానీ మళ్లీ సినిమాలు చేయనని మాత్రం ఇంకా ఘంటాపథంగా చెప్పలేదు. మాట వరసకి ఏవైనా స్టేట్‌మెంట్లు ఇచి వుండొచ్చు కానీ ఇండస్ట్రీ వాళ్లతో అయితే నిక్కచ్చిగా చేయనని అనలేదు. అందుకే అతనికి అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు ఆ డబ్బు వెనక్కి తీసుకోలేదు. అతని వద్ద అడ్వాన్స్‌ వుంటే ఎప్పుడు బుద్ధి పుట్టి సినిమా చేయాలన్నా ముందుగా అవకాశం తమకే వస్తుందని చూస్తున్నారు. అయితే పవన్‌ తిరిగి సినిమాల్లోకి వచ్చేదీ రానిదీ ఎన్నికలే డిసైడ్‌ చేస్తాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన కనుక ప్రభావితం చూపించి 'కింగ్‌ మేకర్‌' కాగలిగితే పవన్‌ ఇక వెనక్కి రాకపోవచ్చు. పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి వుంచి పార్టీని మరింత బలోపేతం చేసుకునే పనిలో పడవచ్చు.

అదే ప్రభావం కొంతే వుంటే కనుక వెంటనే అక్కడ చేయడానికి ఏమీ వుండదు కనుక మళ్లీ సినిమాల వైపు దృష్టి పెట్టవచ్చు. ఇందుకేనేమో తనకి అడ్వాన్సులు ఇచ్చిన వారికి కూడా పవన్‌ ఇక సినిమాలు చేయనని ఖచ్చితంగా చెప్పలేదు. మైత్రి మూవీ మేకర్స్‌కి అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వాలని పవన్‌ భావించినా కానీ వారు తీసుకోలేదు. తర్వాతి సినిమా అంటూ చేస్తే తమకే చేయాలని కోరారు. ఎన్నికలకి వెళ్లే ముందే చేద్దామని చూసాడు కానీ కుదర్లేదు. ఈ ఎన్నికల తర్వాత అయినా పవన్‌ తిరిగి వచ్చేస్తాడని, అతనితో సినిమా తీయాలనే తమ కోరిక నెరవేరుస్తాడని మైత్రి వాళ్లు నమ్ముతున్నారు. ఎలాగో తమ వద్ద త్రివిక్రమ్‌ డేట్స్‌ కూడా వుండడంతో వారి కలయికలోనే అది సెట్‌ అవుతుందని ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English