షాకింగ్: జబర్దస్త్ కమెడియన్ లింగ మార్పిడి

షాకింగ్: జబర్దస్త్ కమెడియన్ లింగ మార్పిడి

జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్ లేని స్కిట్ ఉండదు. ఈ షోలో హైపర్ ఆది లాంటి ఒకరిద్దరు మినహాయిస్తే.. టీం లీడర్లతో సహా అందరూ ఏదో ఒక దశలో లేడీ గెటప్స్ వేస్తుంటారు. మరీ కొందరైతే ఎప్పుడూ అమ్మాయిల్లాగే కనిపిస్తుంటారు. వినోద్.. శాంతి స్వరూప్.. సాయితేజ లాంటి వాళ్లు లేడీ గెటప్‌లకే పరిమితం అయిపోయారు.

వాళ్లు వేరే అవతారాల్లో చూసిందే లేదు జనాలు. ఐతే వీరిలో సాయితేజ నిజంగానే ఇప్పుడు అమ్మాయిగా మారిపోయి అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఇటీవలే సాయితేజ లింగ మార్పిడి చేసుకుని అమ్మాయిగా మారడం విశేషం. ఒక టీవీ షోలో ఈ విషయాన్ని స్వయంగా అతనే వెల్లడించాడు. ఈ కార్యక్రమానికి అతను అమ్మాయి అవతారంలోనే వచ్చాడు. తాను అవకాశాల కోసం.. డబ్బు కోసం ఇలా చేయించుకోలేదని సాయితేజ స్పష్టం చేశాడు.

సాయితేజలో చిన్నప్పట్నుంచి అమ్మాయి లక్షణాలు ఉన్నాయట. ఐతే ఎవరికైనా చెబితే ఏమంటారో అని.. తన కుటుంబం పరువు పోతుందేమో అని ఈ విషయాన్ని లోలోన దాచేసినట్లు అతను చెప్పాడు. తన ఇంట్లోవాళ్లు బయటికి వెళ్లినపుడు తన సోదరి దుస్తులు వేసుకుని అద్దం ముందు నిలబడి మురిసిపోయేవాడినని సాయితేజ చెప్పాడు. ‘జబర్దస్త్’లో అమ్మాయి గెటప్ వేస్తున్నపుడు కూడా చాలా సంతోషించానని.. తనకంటూ ఒక కెరీర్ వచ్చాక ఇక రాజీ పడకూడదని తాను సర్జరీ చేయించుకుని పూర్తిగా అమ్మాయిగా మారినట్లు సాయితేజ వెల్లడించాడు.

ఐతే సొసైటీ తననిప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటుందో అన్న భయం తనలో ఉందన్నాడు. అందుకే చాలా రోజులు బయటికి రాలేదన్నాడు. మధ్యలో తనకు తీవ్ర అనారోగ్యం వచ్చిందని.. ఒక పెద్ద హాస్పిటల్లో కొన్ని రోజుల పాటు బెడ్ మీదే ఉన్నానని.. చాలా ఖర్చయిందని.. ఇక బతకనేమో అన్న సందేహం కూడా కలిగిందని.. అలాంటి సమయంలో కొందరు మిత్రులు అండగా నిలిచి తనను బతికించారని సాయితేజ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English