బ్లాక్‌బస్టర్‌ బ్యానర్‌కి అగ్ని పరీక్ష

బ్లాక్‌బస్టర్‌ బ్యానర్‌కి అగ్ని పరీక్ష

వరుసగా ముగ్గురు టాప్‌ హీరోలతో మూడు బడా బ్లాక్‌బస్టర్‌ సినిమాలు తీసి నిర్మాతలుగా ఒకేసారి అగ్ర స్థాయికి చేరిపోయిన మైత్రి మూవీ మేకర్స్‌ ఇప్పుడు స్టార్‌ వేల్యూ లేకుండా రెండు వారాల వ్యవధిలో రెండు సినిమాలతో పరీక్షకి సిద్ధమవుతున్నారు. మహేష్‌, ఎన్టీఆర్‌, చరణ్‌తో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, రంగస్థలం అంటూ వరుసగా పెద్ద హిట్లు తీసిన ఈ సంస్థ ఇప్పుడు మధ్య శ్రేణి హీరోలతో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. యాక్షన్‌ సినిమాలు అచ్చిరాని నాగ చైతన్యతో తీసిన 'సవ్యసాచి' చిత్రం నిర్మాణంలో జాప్యం జరగడం వల్ల నవంబరు 2న విడుదలవుతోంది.

ప్రస్తుతం ఫామ్‌లో లేని శ్రీను వైట్ల, రవితేజ కలిసి చేసిన 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' కూడా నవంబరు 16న విడుదలకి సిద్ధమైంది. రెండు వారాల్లో రెండు సినిమాలు విడుదల చేయడమంటే ఏ నిర్మాతలకి అయినా చిన్న విషయం కాదు. అసలే వరుస విజయాలతో తమ సంస్థకి వచ్చిన పేరుని, సక్సెస్‌ని నిలబెట్టుకోవాలనే ఆరాటం, ఒత్తిడి కూడా వుంటుంది. మరి ఈ సినిమాలతోను తమ ప్రత్యేకత చాటుకుని హిట్లు కొడతారా? ఈ చిత్రాలతోను మైత్రి మూవీస్‌ ఘన విజయాలు అందుకుంటే మాత్రం మిగిలిన అగ్ర నిర్మాతలందరికీ వీరి నుంచి పోటీ తీవ్రతరం కావడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English