రవితేజ భయపడ్డాడా... ఛాన్సే లేదు!

రవితేజ భయపడ్డాడా... ఛాన్సే లేదు!

'నోటా' కంటే ముందు అక్టోబర్‌ 5 రిలీజ్‌ డేట్‌ని 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' చిత్రం కోసం రిజర్వ్‌ చేసుకున్నారు. కానీ నోటా కూడా అదే డేట్‌కి రావడం, వారం తర్వాత 'అరవింద సమేత' రిలీజ్‌ వుండడంతో మైత్రి మూవీ మేకర్స్‌ తమ చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. విజయ్‌ దేవరకొండకి రవితేజ కూడా భయపడ్డాడంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అయితే అంత రద్దీలో హడావుడిగా విడుదల చేయడం దేనికని వాయిదా వేసుకున్నారు కానీ రవితేజకి ఎవరంటే భయం లేదు. ఇది నిరూపించడానికేనా అన్నట్టు ఇప్పుడు 'టాక్సీవాలా' అనౌన్స్‌ చేసిన నవంబరు 16కే 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' రిలీజ్‌ చేస్తున్నారు.

అసలే పలుమార్లు వాయిదా పడి అస్సలు క్రేజ్‌ లేని 'టాక్సీవాలా'కి ఇది పెద్ద పరీక్షే అవుతుంది. ఎంత విజయ్‌ దేవరకొండ వున్నా కానీ అతను అన్ని చిత్రాలనీ గట్టెక్కించలేడని 'నోటా'తో తేలిపోయింది. బాగా స్టేల్‌ అయిపోవడమే కాకుండా ఒక విధమైన చిన్నచూపు కూడా 'టాక్సీవాలా'పై ఏర్పడిన నేపథ్యంలో రవితేజ, శ్రీను వైట్ల లాంటి క్రేజీ కాంబినేషన్‌లో సినిమా పోటీగా రావడం విజయ్‌ దేవరకొండ సినిమాకి విపరిణామమే. అసలే 'అ.అ.ఆ' చిత్రం రొటీన్‌ రవితేజ సినిమాలా కాకుండా వెరైటీ వైట్ల సినిమాలా కనిపిస్తోందాయె. ఈమధ్య విజయ్‌ దేవరకొండకి అంతా జంకుతోన్న టైమ్‌లో ఫర్‌ ఏ ఛేంజ్‌ ఈసారి విజయ్‌ దేవరకొండ సినిమానే వెనుకంజలో వుంటుందన్నమాట.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English