సూపర్‌స్టార్‌ని నిలువునా ముంచిన గాళ్‌ఫ్రెండ్‌!

సూపర్‌స్టార్‌ని నిలువునా ముంచిన గాళ్‌ఫ్రెండ్‌!

కంగనా రనౌత్‌ అనుకున్నది సాధించింది. హృతిక్‌ రోషన్‌పై పగ సాధింపు చర్యలో భాగంగా అతడిని ఇరుకున పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని ఆమె వదులుకోవడం లేదనేది తెలిసిందే. హృతిక్‌ తన 'సూపర్‌ 30' చిత్రాన్ని జనవరి 25న విడుదల చేస్తున్నాడని తెలిసి, తన 'మణికర్ణిక' చిత్రాన్ని కూడా అదే రోజున విడుదల చేయడానికి నిర్ణయించుకుంది. ఇంతలో 'మీటూ' గోలలో 'సూపర్‌ 30' దర్శకుడు వికాల్‌ భాల్‌ ఇరుక్కోవడంతో అతడిని కంగన మరింత కార్నర్‌ చేసింది. మిగతా వాళ్లంతా అతనిపై ఆరోపించినా పెద్ద ఎఫెక్ట్‌ చూపించేది కాదు కానీ 'క్వీన్‌' చిత్రీకరణ సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తనపై చేతులు వేసి తడిమేవాడని, పలకరింపు పేరుతో కౌగిలించుకుని ఎక్కడెక్కడో చేతులు వేసేవాడని ఆరోపించింది.

ఇలాంటి ఆరోపణలు వచ్చిన దర్శకులు అందరినీ మిగతా సినిమాలకి తొలగిస్తూ వుండడంతో 'సూపర్‌ 30' మేకర్స్‌పై కూడా ఒత్తిడి పెరిగింది. అతడిని తప్పించక తప్పని పరిస్థితి వచ్చింది. సినిమా షూటింగ్‌ పూర్తయినా కానీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ అతను లేకుండానే చేయాలని చూస్తున్నారు. దీంతో ఈ చిత్రం ముందుగా అనుకున్నట్టు జనవరి 25కి విడుదల కాదట. అటు హృతిక్‌ని ఇరకాటంలో పెట్టడమే కాకుండా తన సినిమాకి పోటీని కూడా తొలగించుకుని కంగన రెండు విధాల పగ తీర్చుకున్నట్టయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English