ఆ సినిమా చూపించబోతున్న మహేష్

ఆ సినిమా చూపించబోతున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్ వాళ్లతో కలిసి అతను ఏఎంబీ సినిమా పేరుతో తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ బిజినెస్ మొదలుపెట్టాడు. మొదటగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్ తొలి బిల్డింగ్ అతి త్వరలోనే ఆరంభం కాబోతోంది. దీపావళి శుభ సందర్భంగా నవంబరు 8న ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది. మహేష్ బాబుతో పాటు ఆయన భార్యాపిల్లలు.. తండ్రి కృష్ణ సైతం ఈ వేడుకలో పాల్గొంటారట.

ఇంతకీ మహేష్ మల్టీప్లెక్స్‌లో మొదటగా ప్రదర్శింంచబోతున్న సినిమా ఏదో తెలుసా... థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. మల్టీ స్క్రీన్స్ ఉన్న ఈ కాంప్లెక్స్‌లో అమీర్ సినిమానే తొలి షోగా వేయబోతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. భారీ బడ్జెట్లో.. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేష్ మల్టీప్లెక్స్‌లో చూసిన జనాలు ఎలాంటి అనుభూతికి లోనవుతారో చూడాలి.

ప్రస్తుతం మహేష్ బాబు 'మహర్షి' షూటింగ్ కోసం అమెరికాలో ఉన్నాడు. త్వరలోనే షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకు రాబోతున్నాడు. దీపావళిని కుటుంబంతో కలిసి జరుపుకుని.. మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొంటాడు. ఏషియన్ సినిమాస్ వాళ్లకి ఆల్రెడీ హైదరాబాద్‌తో పాటు.. కొన్ని నగరాల్లో మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. మహేష్‌తో కలిసి మరింతగా ఈ బిజినెస్‌ను విస్తరించడానికి ప్రణాళికలు రచించారు. ముందు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాక.. తర్వాత ఇతర రాష్ట్రాలకూ వెళ్తారట. వీళ్ల ప్రణాళికలు అనుకున్న ప్రకారం జరిగితే ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ ఛైన్స్‌లో వీళ్లది ఒకటవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English