నేను అరెస్టు కాలేదు...ర‌వి క్లారిటీ!

నేను అరెస్టు కాలేదు...ర‌వి క్లారిటీ!

యాంక‌ర్ ర‌వి....ఓ సినీ డిస్ట్రిబ్యూటర్ ను బెదిరించాడ‌ని, దాడికి యత్నించాడని పోలీసు స్టేష‌న్ లో ఫిర్యాదు న‌మోదైంద‌ని నేడు ఉద‌యం నుంచి వ‌దంతులు వ్యాపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. స‌ద‌రు డిస్ట్రిబ్యూట‌ర్ ఇచ్చిన ఫిర్యాదుతో రవిని హైదరాబాద్, ఎస్సార్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. బాకీ వసూలుకు సంబంధించి త‌న‌కు ఫోన్ చేసి ర‌వి బెదిరించాడని, 20 మందితో కలిసి ఇనుపరాడ్లతో తనపై దాడికి ప్రయత్నించాడని సందీప్ అనే డిస్ట్రిబ్యూట‌ర్  ఫిర్యాదు చేసిన‌ట్లు పుకార్లు వ‌చ్చాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నార‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో త‌నపై వ‌చ్చిన ఫిర్యాదుపై ర‌వి స్పందించాడు. త‌న‌పై వ‌స్తోన్న వ‌దంతుల‌ను ర‌వి ఖండించాడు. త‌న‌ను ఎవ‌రూ అరెస్టు చేయ‌లేద‌ని, పోలీసులు విచార‌ణ చేయ‌లేద‌ని ర‌వి చెప్పాడు. ప్ర‌స్తుతం తాను మచిలీపట్నంలో ఉన్నానని, `జెమీటీ టీవీ` దీపావళి ఉత్సవ కార్యక్రమాల షూటింగ్ తో బిజీగా ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు. తాను ఎక్కడ ఉన్నదీ, ఏం చేస్తున్నదీ తెలియజేస్తూ ఓ వీడియోను ర‌వి విడుదల చేశాడు. తనపై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఆ వ‌దంతుల‌ను వ్యాప్తి చేయ‌వ‌ద్ద‌ని ర‌వి కోరాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English