పాపం అనవసరంగా ఆ హీరోని నిందించారే..

పాపం అనవసరంగా ఆ హీరోని నిందించారే..

మీ టూ’ ఉద్యమంలో భాగంగా బాలీవుడ్లో చాలామంది ప్రముఖులకు గట్టిగా సెగ తాకుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాంటి మంచి ఇమేజ్ ఉన్న హీరో కూడా బద్నాం అయ్యాడు. సంజన అనే యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనానికి దారి తీసింది. సుశాంత్ హీరోగా నటిస్తున్న ‘కిజీ ఔర్‌ మ్యానీ’ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్న సంజన.. అతను తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని.. వేధించాడని ఆరోపించినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.ఈ ఆరోపణలపై సుశాంత్ వెంటనే స్పందించాడు. అసలు ఈ సినిమా సెట్స్‌లో ఏం జరిగిందో.. తమ మధ్య ఫోన్ సంభాషణ ఎలా నడిచిందో అతను వివరించాడు. సంజనకు.. తనకు మధ్య జరిగిన ఫోన్ ఛాటింగ్ మొత్తం స్క్రీన్ షాట్స్ తీసి అతను ట్విట్టర్లో షేర్ చేశాడు.

తర్వాత సంజన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఐతే ఇప్పుడు సంజన పూర్తి భిన్నమైన వెర్షన్‌తో మీడియా ముందుకొచ్చింది. అసలు తనను సుశాంత్ వేధించలేదని ఆమె పేర్కొంది. మరి ఇన్నాళ్లూ తానెందుకు మౌనంగా ఉన్నానో కూడా సంజన వెల్లడించింది. తాను అమెరికా పర్యటనకు వెళ్లానని.. చాలా రోజులుగా ఇండియాలో లేనని.. ఈ మధ్యలో తన గురించి నిరాధార వార్తలు.. కథనాలు వచ్చాయని సంజన తెలిపింది. ‘కిజీ ఔర్‌ మ్యానీ’ సినిమా షూటింగ్ సందర్భంగా తనకు ఎలాంటి వేధింపులు ఎదురు కాలేదని ఆమె స్పష్టం చేసింది. ఈ దుష్ప్రచారానికి ఇంతటితో తెరదించాలని ఆమె కోరింది. ఐతే సంజన ఈ స్టేట్మెంట్ ఇచ్చిందంటే.. మరి ఇన్నాళ్లూ ఆమె పేరుతో ఎవరు ఆరోపణలు చేసినట్లు? ఏదేమైనప్పటికీ అనవసరంగా సుశాంత్ మీద మచ్చ పడి.. అతను విమర్శలు ఎదుర్కొన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English