విడి విడిగా ఫ్లాప్‌... కలిసికట్టుగా వస్తే?

విడి విడిగా ఫ్లాప్‌... కలిసికట్టుగా వస్తే?

ముగ్గురూ టాలెంటెడ్‌ యాక్టర్లే అయినా, కథల ఎంపికలో ముగ్గురిదీ ప్రత్యేక శైలి అయినా కానీ వారికి అదృష్టం కలిసి రావడం లేదు. నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్‌బాబు సోలోగా సక్సెస్‌ కాలేకపోతున్నారు. ఈసారి వీరు ముగ్గురూ కలిసికట్టుగా వస్తున్నారు. 'వీర భోగ వసంత రాయలు' చిత్రంతో వీరంతా కలిసి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే ట్రెయిలర్‌తో, శ్రీవిష్ణు గెటప్‌తో ఈ చిత్రం హాట్‌ టాపిక్‌ అయింది. చూడాలనే కుతూహలాన్ని రేకెత్తించింది. మరి ఈసారి అయినా వీరు కోరుకునే విజయం వరిస్తుందా? ఇంతకుముందు రోహిత్‌, సుధీర్‌ కలిసి 'శమంతకమణి' చిత్రంలో కలిసి నటించారు. కానీ అది అనుకున్నంత సక్సెస్‌ అవలేదు.

ఈసారి మాత్రం ఈ చిత్రానికి పబ్లిసిటీ బాగా కుదిరింది. ఏం జరుగుతుందనేది శుక్రవారానికి తెలుస్తుంది. ఇదిలావుంటే ఈ చిత్రంలో కలిసి నటించినా కానీ అందరి మధ్య సరైన స్నేహ సంబంధాలు లేవని మాత్రం తేలిపోయింది. సుధీర్‌బాబు ఈ చిత్రానికి డబ్బింగ్‌ చెప్పడానికి నిరాకరించి పబ్లిసిటీకి దూరంగా వేరే దేశం వెళ్లిపోయాడు. అందరూ కలిసి ప్రమోట్‌ చేయడానికి కూడా తీరిక చేసుకోకపోవడంతో ఈ చిత్రానికి ఇంటర్వ్యూల పరంగా తగిన రీచ్‌ లేకుండా పోయింది. చిన్న చిన్న హీరోల మధ్యే ఈగో క్లాషెస్‌ అంటే ఇక పెద్ద వాళ్లతో మల్టీస్టారర్లు చేసే వారి తలనొప్పులు ఎలాగుంటాయో ఏమిటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English