నాగార్జునను ఏం తేలుస్తాడో ఏంటో..

నాగార్జునను ఏం తేలుస్తాడో ఏంటో..

అక్కినేని నాగార్జున ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉన్నాడు. రెండేళ్లుగా వరుసగా ఫ్లాపులు ఎదురవుతుండటంతో తర్వాత ఏం సినిమా చేయాలో తెలియని గందరగోళం ఆయన్ని వెంటాడుతోంది. ప్రస్తుతానికి తమిళంలో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాన్ రుద్ర’తో పాటు హిందీ సినిమా ‘బ్రహ్మాస్త్ర’లో నటిస్తున్న నాగ్.. తెలుగులో తన తర్వాత సినిమా విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఆయన ముందు ప్రస్తుతం రెండు ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో దేన్ని ఓకే చేస్తాడా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నాగార్జునకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన కళ్యాణ్ కృష్ణ కురసాల దీనికి ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ పేరుతో ఒక కథ మీద కొన్నేళ్లుగా పని చేస్తున్నాడు. కానీ ఇంతకుముందు కళ్యాణ్ వినిపించిన వెర్షన్ నాగార్జునకు నచ్చలేదు.

మధ్యలో ‘నేల టిక్కెట్టు’ తీసి తల బొప్పి కట్టించుకున్న కళ్యాణ్.. ఆపై చాలా శ్రద్ధగా ‘బంగార్రాజు’పై కూర్చున్నాడు. సీనియర్ రైటర్ సత్యానంద్ అతడికి సాయం చేస్తున్నాడు. ఐతే నాగార్జున ఈసారైనా ఓకే అంటాడా అన్న గుబులు కళ్యాణ్‌ను వెంటాడుతోందట. అతడికి ‘చి ల సౌ’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నుంచి ముప్పు పొంచి ఉంది. ‘చి ల సౌ’తో నాగ్‌ను మెప్పించి సినిమా ఆఫర్ అందుకున్న రాహుల్.. ‘మన్మథుడు’ తరహాలో ఒక రొమాంటిక్ కథ రాసే ప్రయత్నంలో ఉన్నాడు. అతను దాదాపుగా స్క్రిప్టు పూర్తి చేసినట్లు సమాచారం. అతను కూడా నాగార్జునకు కథ వినిపించి ఓకే చేయించుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ రెంటిలో ఒక కథకే నాగ్ ఓకే చెప్పే అవకాశముంది. ఇంకొకటి పూర్తిగా పక్కన పెడతాడా.. వెయిటింగ్‌లో పెడతాడా అన్నది తెలియదు. ఐతే ప్రస్తుతానికి రాహుల్ వైపే మొగ్గు కనిపిస్తోంది. అతను ఈ ట్రెండుకు తగ్గ దర్శకుడిలా కనిపిస్తున్నాడు. అదే కళ్యాణ్‌కు టెన్షన్‌గా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English