సుధీర్ బాబు తంటాలు చూడండయ్యో

సుధీర్ బాబు తంటాలు చూడండయ్యో

హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ఏళ్ల నుంచి కష్టపడుతున్నాడు సుధీర్ బాబు. కానీ అతడి కెరీర్ ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయింది. ఓవైపు కమర్షియల్ సక్సెస్‌లు లేక.. నటుడిగా మంచి పేరేమీ రాక చాలా ఇబ్బంది పడ్డాడు. ఐతే ఈ ఏడాది ‘సమ్మోహనం’ సినిమా అతడి రాత మార్చేలా కనిపించింది. ఈ సినిమాతో నటుడిగా అతడికి మంచి గుర్తింపే వచ్చింది. సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఇది మంచి విజయం సాధిస్తుందనుకున్నారు. కానీ ఓ మోస్తరుగా ఆడి వెళ్లపోయిందా చిత్రం. దీని తర్వాత వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ మీద సుధీర్ చాలా ఆశలతో ఉన్నాడు. కానీ ఈ సినిమాకు కూడా టాక్ బాగున్నా వసూళ్లు లేవు. ఇక సుధీర్ నటించిన కొత్త సినిమా ‘వీర భోగ వసంత రాయలు’ విడుదలకు సిద్ధమవుతుండగా.. దాని ఊసే ఎత్తట్లేదతను.

ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న కొత్త దర్శకుడు ఇంద్రసేనను ఇంతకుముందు టాలీవుడ్ క్రిస్టఫర్ నోలన్‌గా అభివర్ణించిన సుధీర్.. అదే వ్యక్తితో విభేదాల వల్ల ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పకుండా వదిలేశాడు. సినిమా రిలీజ్ దగ్గరపడుతుండగా.. ప్రమోషన్లలో పాల్గొనకుండా ఫారిన్ టూర్లో ఉన్నాడు సుధీర్. ‘వీర భోగ వసంత రాయలు’ గురించి మాట్లాడకుండా అతను తన కొత్త సినిమా కోసం మార్చుకున్న లుక్‌తో ఫొటో రిలీజ్ చేశాడు. పీఆర్వోలందరికీ దాన్ని పంపి.. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సుధీర్ బాబు అవతారమే మారిపోయిందని.. నెవర్ బిఫోర్ లుక్ అని పీఆర్వోలు వాయించేస్తున్నారు సోషల్ మీడియాలో. కానీ అక్కడున్నదేమైనా మహేష్ బాబా.. జనాలు ఆశ్చర్యపోయి దాని మీద డిస్కషన్లు పెట్టడానికి.. వైరల్ చేయడానికి. సుధీర్ ఎలాంటి లుక్‌లోకి మారితే మాకేంటి అన్నట్లుగా నెటిజన్లు దాని గురించి అసలు పట్టించుకోవడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English