15 రోజుల్లో ఆ హీరోకు రెండో బ్లాక్ బాస్టర్

15 రోజుల్లో ఆ హీరోకు రెండో బ్లాక్ బాస్టర్

బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాకు స్టార్ ఇమేజ్ లేదు కానీ.. అతడి సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయన్న పేరు మాత్రం ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడతను. ఒకప్పుడు ఐపీఎల్ వ్యాఖ్యాతగా ఉన్న ఆయుష్మాన్.. ‘విక్కీ డోనర్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో హీరోగా గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత కూడా అతడి నుంచి కొన్ని మంచి సినిమాలొచ్చాయి. ఇప్పుడతను 15 రోజుల వ్యవధిలో రెండు బ్లాక్ బస్టర్లను ఖాతాలో వేసుకోవడం విశేషం.

ఈ నెల ఐదో తారీఖున ఆయుష్మాన్ నటించిన ‘అందాదున్’ రిలీజైంది. ఇందులో అతను అంధుడిగా నటించాడు. ఒక మర్డర్ మిస్టరీ నేపథ్యంలో చాలా విభిన్నంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తోంది. ‘బద్లాపూర్’ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అదిరిపోయే టాక్‌తో మొదలైన ఆ చిత్రం.. మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ‘అందాదున్’ ఇంకా థియేటర్లలో బాగా ఆడుతోంది.

ఐతే ఆ చిత్రం థియేటర్లలో ఉండగానే.. ఆయుష్మాన్ నటించిన ‘బడాయి హో’ అనే కొత్త సినిమా రిలీజైంది. దసరా కానుకగా ఈ నెల 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇందులో హీరో భార్య.. అతడి తల్లి ఒకేసారి గర్భం దాలుస్తారు. కొన్ని రోజుల కిందట విడుదలైన దీని ట్రైలరే సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాపై అంచనాల్ని పెంచింది. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉండటంతో దీనికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. వీకెండ్లోనే రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. తర్వాత కూడా జోరు కొనసాగిస్తోంది. ఇది కూడా వంద కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని అమిత్ శర్మ రూపొందించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English