అదే.. జిగేల్ రాణి పాట స‌క్సెస్‌కు కార‌ణ‌మ‌ట‌!

అదే.. జిగేల్ రాణి పాట స‌క్సెస్‌కు కార‌ణ‌మ‌ట‌!

స‌న్న‌జాజి తీగ‌లా ఉండే అందం  పూజాహెగ్డే సొంతం. వ‌రుస‌పెట్టి అగ్ర‌హీరోల‌తో సినిమాలు చేస్తున్న ఈ భామ‌.. ఆ మ‌ధ్య‌న రంగ‌స్థ‌లంలో జిగేల్ రాణిగా వెండితెర మీద త‌ళుక్కున మెరిసింది. సినిమాలో ఆ పాట ఐదు నిమిషాలే అయినా.. ఆ పాట ప్ర‌భావం అంతా ఇంతా కాదు. పూజా హెగ్డేలోని మాస్ యాంగిల్ ఈ పాట‌తో బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అగ్ర హీరోల‌తో  బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న వేళ‌.. అందుకు భిన్నంగా స్పెష‌ల్ సాంగ్ న‌టించాల‌న్న పూజా నిర్ణ‌యం చాలామందికి షాకింగ్ గా అనిపించింది. కానీ.. తెర మీద జిగేల్ రాణిని చూసిన త‌ర్వాత‌.. ఆమె ఎన‌ర్జీతో పాటు.. ఆమె గ్లామ‌ర్ ఈ పాట‌కు పెద్ద ప్ల‌స్ గా మారింది.

అయిదారు నెల‌లు క‌ష్ట‌ప‌డి ఒక సినిమా చేసినా పేరు.. ఫ‌లితం వ‌స్తుందో?  రాదో?  అన్న ప్ర‌శ్న‌లేమీ లేకుండా ఐదు నిమిషాల జిగేల్ రాణి సాంగ్ పుణ్య‌మా అని పూజాకు వ‌చ్చిన పేరు ప్ర‌ఖ్యాతులు అన్ని ఇన్నికావు. ఇదిలా ఉంటే.. ఈ పాట అంత స‌క్సెస్ ఫుల్ కావ‌టానికి కార‌ణాన్ని తాజాగా చెప్పుకొచ్చింది పూజా.

జిగేల్ రాణి పాట ఐదు నిమిషాలే అయినా.. ప్రేక్ష‌కుల మ‌దిలో అంత‌లా రిజిస్ట‌ర్ కావ‌టానికి  కార‌ణం.. ఆ పాట‌ను ఛాలెంజ్ గా తీసుకోవ‌ట‌మేన‌ని చెప్పారు. అందులో త‌న డాన్స్.. ఎక్స్ ప్రెష‌న్స్ బాగా న‌చ్చ‌టంతో మంచి పేరు వ‌చ్చిందని.. ఆ పాట‌లో బాగా డాన్స్ చేయ‌టానికి కార‌ణం..త‌న బ్యాక్ గ్రౌండేన‌ని చెప్పింది.

త‌న‌కు డాన్స్ అన్నా.. సంగీత‌మ‌న్నా చాలా ఇష్ట‌మ‌ని.. పదేళ్ల వ‌య‌సులో భ‌ర‌త‌నాట్యం నేర్చుకున్న‌న‌ట్లు చెప్పింది. ఉద‌యం లేచింది మొద‌లు రాత్రి నిద్ర‌పోయే వ‌ర‌కూ సంగీతాన్ని వింటూనే ఉండేద‌ట‌. దీంతో.. జిగేల్ రాణి పాట‌ను క‌నెక్ట్ అయ్యేలా చేయ‌టంలో త‌న‌కున్న అనుభ‌వం ఎంతో హెల్ప్ చేసిన‌ట్లు పేర్కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English