ఎన్టీఆర్‌కు బ్రాహ్మణి స్పెషల్ గిఫ్ట్?

ఎన్టీఆర్‌కు బ్రాహ్మణి స్పెషల్ గిఫ్ట్?

నందమూరి కుటుంబంలో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘అరవింద సమేత’ విజయోత్సవ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వస్తున్నాడని నిన్న సాయంత్రం వెల్లడి కాగానే అది హాట్ టాపిక్ అయిపోయింది. బాబాయి-అబ్బాయి కలయిక మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న చర్చ నడుస్తోంది.

ఇలాంటి సమయంలోనే మరో ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. బాలయ్య తనయురాలు నారా బ్రాహ్మణి ‘అరవింద సమేత’ సినిమా చూసిందని.. ఆమెకు సినిమా చాలా నచ్చిందని.. ఎన్టీఆర్ నటన అద్భుతమంటూ కితాబిస్తూ స్టేట్మెంట్ ఇచ్చిందని వార్తలొస్తున్నాయి.

అంతే కాదు.. మూడు రోజుల కిందట విజయ దశమి సందర్భంగా బ్రాహ్మణి ఎన్టీఆర్‌కు ఒక మరుపురాని కానుక కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హరికృష్ణకు సంబంధించిన పాత ఫొటోలను సేకరించి వాటిని ఆల్బమ్‌గా తయారు చేయించి సీడీ రూపంలో ఎన్టీఆర్‌కు బ్రాహ్మణి పంపించిందట తన చెల్లెలు పంపిన ఆ సీడీలోని ఫొటోలు చూసిన ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడట.. తన తండ్రి హరికృష్ణను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారని సన్నిహితులు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.

వెంటనే బ్రాహ్మణికి ఫోన్ చేసి ఇలాంటి బహుమతి పంపినందుకు థ్యాంక్స్ కూడా చెప్పాడట తారక్. ఈ వార్తలో నిజమెంతో కానీ.. ఈ రోజు దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English