త్రివిక్రమ్‌ ఆమెని మోసం చేసాడట!

త్రివిక్రమ్‌ ఆమెని మోసం చేసాడట!

ప్రాధాన్యం లేని పాత్రల్లో హీరోయిన్లని పెట్టడం, ఫైనల్‌ కట్‌లో వారికి తగిన న్యాయం జరక్కపోవడం త్రివిక్రమ్‌ సినిమాల్లో మామూలే. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో నిత్య మీనన్‌లాంటి టాలెంటెడ్‌ యాక్ట్రెస్‌ని ఎంత వేస్ట్‌ చేసాడో తెలిసిందే. అరవింద సమేతలో తనకి అవకాశం వస్తే ఈషా రెబ్బా తెగ ఆనందపడిపోయింది. సెకండ్‌ హీరోయిన్‌ అంటూ చెప్పడంతో ఆమె వేరే చిత్రాలు వదులుకుని మరీ ఇందులో నటించింది. అయితే అసలు కథలో ఆమెకి ఇంపార్టెన్సే లేదు. ఆమె వున్న సీన్లు కూడా కావాలని ఇరికించినట్టే వుంటాయి తప్ప అవసరానికి పెట్టినట్టుండవు.

హీరోయిన్‌ వేషం అన్నారు, కనీసం ఒక్క పాట కూడా లేదని ఆమె గోల పెడితే 'పెనిమిటి' పాటలో రెండు షాట్లు ఆమెపై వేసి సరిపెట్టుకోమన్నారట. ఈ చిత్రం తర్వాత స్టార్‌ అయిపోతానని ఆశ పడిన ఈ తెలుగు హీరోయిన్‌, లీడ్‌ క్యారెక్టర్‌ అని చెప్పి మోసం చేసారని తెలిసిన వారి దగ్గర వాపోతోందట. చిన్నా చితకా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ కాస్త పేరు తెచ్చుకున్న ఈషాకి ఈ చిత్రం వల్ల యాడ్‌ అయిందేమీ లేదు. ఇక మీదట అయినా పెద్ద సినిమాల్లో అవకాశమంటే పాత్ర నిడివి ఎంతో తెలుసుకోకుండా సంతకాలు చేయకపోతే మేలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English