బాలయ్య రాక దేనికి సంకేతం?

బాలయ్య రాక దేనికి సంకేతం?

మొత్తానికి నందమూరి అభిమానులు చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఒకరి గురించి ఒకరు మాట్లాడబోతున్నారు. ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉన్న వీళ్లిద్దరూ.. తర్వాత అనుకోని కారణాలతో దూరమయ్యారు. కొన్నేళ్లుగా ఒకరి గురించి ఒకరు మాట్లాడటమే మానేశారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం కూడా చేసి పెట్టిన ఎన్టీఆర్.. ఆ తర్వాత ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు. ఆ పార్టీ కూడా తారక్‌ను పక్కన పెట్టేసింది. బాలయ్య.. ఎన్టీఆర్ పొడే గిట్టనట్లు ప్రవర్తించాడు. ఎన్టీఆర్ ఎప్పుడైనా బాలయ్య ప్రస్తావన వస్తే తమ మధ్య ఏమీ లేదన్నట్లుగా మాట్లాడేవాడు కానీ.. ఇంతకుముందులా బహిరంగా వేదికల్లో బాబాయి గురించి ప్రస్తావించడం మానేశాడు.

హరికృష్ణ మరణం తర్వాత కొన్ని రోజులు ఇద్దరూ సన్నిహితంగా కనిపించినప్పటికీ.. ‘అరవింద సమేత’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వస్తాడనుకున్న బాలయ్య.. దానికి దూరంగానే ఉండటంతో బాబాయ్-అబ్బాయి మధ్య దూరం తగ్గలేదనే అనుకున్నారంతా. కానీ ఆశ్చర్యకరంగా ఆదివారం నిర్వహించే ఈ చిత్ర సక్సెస్ మీట్లో బాలయ్య పాల్గొనబోతున్నాడని కన్ఫమ్ అయింది. ఐతే దీని వెనుక ఏం జరిగి ఉంటుందో.. భవిష్యత్తులో ఏం జరగబోతోంది అన్న చర్చ నడుస్తోందిప్పుడు. హరికృష్ణ మరణించి నెలన్నర దాటింది. అందరూ ఆ సంగతి మరిచిపోతున్నారు. ఆ విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని బాలయ్య రావాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌తో సన్నిహితంగా ఉండటం మంచిదే అన్న ఉద్దేశంతో బాలయ్య వస్తున్నాడేమో అన్న చర్చ నడుస్తోంది.

ఇంతకుముందు పవన్ కళ్యాణ్.. చిరు కుటుంబానికి దూరం దూరంగా ఉండేవాడు. మిగతా మెగా హీరోల్ని కూడా దూరం పెట్టేవాడు. కానీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండగా.. అతడిలో చాలా మార్పు వచ్చింది. చిరు, చరణ్.. ఇతర మెగా ఫ్యామిలీ సభ్యులతో క్లోజ్ అయ్యాడు. ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటున్నాడు.

ఎన్నికలు వస్తుంటే ఏ చిన్న నెగెటివ్ విషయాన్ని కూడా పట్టించుకోకుండా వదిలిపెట్టరు. నందమూరి అభిమానులందు ఎన్టీఆర్ అభిమానులు వేరు అన్నట్లుగా పరిస్థితి తయారైంది కొన్నేళ్లుగా. రాబోయే ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి జూనియర్‌ను దూరం చేసుకోవడం తెలుగుదేశం పార్టీకి మంచిది కాదన్న అభిప్రాయాల నేపథ్యంలో అతడిని మళ్లీ బాబు, బాలయ్య చేరదీస్తారని.. కుదిరితే ప్రచారానికి కూడా తీసుకెళ్లే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్‌కు బాలయ్య వస్తున్నాడని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English