సినీ న‌టులు వైజాగ్ ప్ర‌సాద్ ఆక‌స్మిక మ‌ర‌ణం

సినీ న‌టులు వైజాగ్ ప్ర‌సాద్ ఆక‌స్మిక మ‌ర‌ణం

టాలీవుడ్ కు మ‌రో షాక్ త‌గిలింది. గ‌డిచిన సంవ‌త్స‌రాల్లో ఎప్పుడూ లేని విధంగా కొంత‌కాలంగా టాలీవుడ్‌లోని ప్ర‌ముఖుల మ‌ర‌ణాలు ఇండ‌స్ట్రీని వ‌రుస విషాదాల్లో నింపుతున్నాయి. తాజాగా ప్ర‌ముఖ సినీ న‌టుడు వైజాగ్ ప్ర‌సాద్ ఆదివారం తెల్ల‌వారుజామున గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఆదివారం తెల్ల‌వారుజామున బాత్రూంకు వెళ్లిన ఆయ‌న అక్క‌డే కుప్ప‌కూలిపోయారు.

ఆయ‌న బాత్రూంలో స్పృహ త‌ప్పిపోయిన విష‌యాన్ని గుర్తించిన కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లుగా వైద్యులు వెల్ల‌డించారు. తాజాగా ఆయ‌న భౌతికాయాన్ని నిమ్స్ మార్చురీలో ఉంచారు.

ఆయ‌న కుమార్తె అమెరికాలో ఉండ‌టం.. ఆమె వ‌చ్చే వ‌ర‌కూ నిమ్స్ లోనే మృత‌దేహాన్ని ఉంచ‌నున్న‌ట్లు చెబుతున్నారు. క్యారెక్ట‌ర్ న‌టుడిగా వైజాగ్ ప్ర‌సాద్ ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించారు. చూసినంత‌నే గుర్తించే ఆయ‌న లేక‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. ఎంతోమంది గుర్తింపు పొందిన ఆయ‌న‌.. ఇప్పుడు మార్చురిలో ఒంట‌రిగా శాశ్విత నిద్ర‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. వైజాగ్ ప్ర‌సాద్ మ‌ర‌ణ‌వార్త టాలీవుడ్‌లో విషాదాన్ని నింపింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English