రెండు ఫ్లాపులతో నాని సెట్‌ రైట్‌

రెండు ఫ్లాపులతో నాని సెట్‌ రైట్‌

వరుసగా విజయాలు వస్తున్నపుడు ఏదో ఒకనాడు ఈ హిట్లకి బ్రేక్‌ పడుతుందని తెలుసు అంటూ వచ్చిన నాని హిట్‌ జోరులో కథల ఎంపికపై శ్రద్ధ పెట్టలేదు. నాసిరకం సినిమాలు చేసి పరాజయాలు కొని తెచ్చుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం తర్వాత దేవదాస్‌తో కూడా ఫ్లాప్‌ చవిచూసిన నాని ఇక మళ్లీ తన మునుపటి శైలికి వచ్చేసాడు. అప్పట్లో ప్రయోగాత్మకంగా అనిపించే కథలని మాత్రమే ఎంపిక చేసుకున్న నాని మధ్యలో మాస్‌ కథలు, యాక్షన్‌ సీన్లు కావాలంటూ పట్టు పట్టాడనే ప్రచారం బాగా జరిగింది. అందుకు తగ్గట్టే అతని సినిమాల తీరు కూడా సాగింది. రెండు ఫ్లాపులు రావడం, అదే సమయంలో పోటీగా విజయ్‌ దేవరకొండ రైజ్‌ అవడంతో నాని వెంటనే తప్పు తెలుసుకున్నాడు. అందుకే ఇప్పుడు అన్నీ కథకి ప్రాధాన్యమున్న సినిమాలే ఎంచుకుంటున్నాడు.

కమర్షియల్‌ చిత్రాలు ట్రాక్‌ తప్పితే హీరోగా తన బ్రాండ్‌ దెబ్బ తినడమే కాకుండా మార్కెట్‌ కూడా డౌన్‌ అవుతుందని నానికి తెలియడంతో ఇక అలాంటి మిస్టేక్స్‌ రిపీట్‌ చేయరాదని భావిస్తున్నాడు. జెర్సీ సినిమా నుంచే నాని మళ్లీ వెరైటీ రోల్స్‌లో కనిపించబోతున్నాడు. ఇంతకాలం తనపై పడిన రొటీన్‌ ముద్రని చెరిపేసుకుని సరికొత్త ఇమేజ్‌తో నేటి తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమాలు చేసే పనిలో పడ్డాడు. నాని లాంటి ప్రతిభావంతులైన హీరోలు ఇమేజ్‌ ఛట్రంలో పడకపోవడం తెలుగు సినిమాకి, తెలుగు సినీ ప్రియులకి కూడా శుభ పరిణామమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English