వర్మను ఇలా ఎప్పుడైనా చూశారా?

 వర్మను ఇలా ఎప్పుడైనా చూశారా?

రామ్ గోపాల్ వర్మ శుక్రవారం తన ట్విట్టర్ ఫాలోవర్లకు పెద్ద షాకే ఇచ్చాడు. ఎన్నడూ లేని విధంగా ఆయన పరమ భక్త అవతారం ఎత్తేశాడు. తాను నాస్తికుడనని ఎప్పుడూ చెప్పుకునే వర్మ.. తిరుమలకు వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని.. టీటీడీ వారితో శాలువా కప్పించుకుని.. నుదుటన బొట్టు పెట్టుకుని.. చేతిలో ప్రసాదాలతో ఫొటోలకు పోజు ఇచ్చాడు.

ఆ ఫొటోను ట్విట్టర్లో, ఫేస్ బుక్‌లో షేర్ చేసుకుని.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కోసం తాను ఇలా తయారు కావాల్సి వచ్చిందని.. ఎన్టీఆరే తననిలా తయారు చేశాడని కామెంట్ పెట్టాడు. ఈ రోజు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను మొదలుపెట్టబోతూ.. దాని కంటే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నానని వర్మ ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి కొన్ని గంటల్లో వర్మ ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ చిత్ర విశేషాలు వెల్లడించబోతున్నాడు.

వర్మ ఎంత పెద్ద నాస్తికుడో గతంలో ఎన్నోసార్లు రుజువైంది. దేవుళ్ల విషయంలో తమాషా కామెంట్లు పెడుతుంటాడతను. కొన్ని సార్లు శ్రుతి మించి పోయి వెకిలి మాటలూ మాట్లాడుతుంటాడు. ఈ విషయంలో వర్మ తీవ్ర వ్యతిరేకత కూడా ఎదుర్కొన్నాడు. అలాంటి వాడు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని ఇలా ఎన్నడూ చూడని అవతారంలో ఫొటో పెట్టేసరికి అతడి ఫాలోవర్లు షాకైపోతున్నారు.

కొందరు.. ఇంతకీ నువ్వెవ్వరు.. మా ఆర్జీవీ ఎక్కడ అని కూడా సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఈ సంగతలా వదిలేస్తే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్ మీట్లో వర్మ ఏం చెప్పబోతున్నాడు.. ఎలాంటి సంచలనాలకు తెర లేపబోతున్నాడన్నది ఆసక్తికరం. వెంటేనే ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టి జనవరి నెలాఖరుకల్లా సినిమాను పూర్తి చేయాలని వర్మ భావిస్తున్నాడు. సరిగ్గా ఆ సమయానికే బాలయ్య-క్రిష్ చేస్తున్న ‘యన్.టి.ఆర్’ రెండు భాగాలూ రిలీజై ఉంటాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English