అంజలి.. అంజలి.. ఏం చేస్తున్నావ్‌?

అంజలి.. అంజలి.. ఏం చేస్తున్నావ్‌?

మొన్నటికి మొన్న మిస్సింగ్‌ ఎపిసోడ్‌తో షాకిచ్చిన అంజలి, ఇప్పుడు యాకంగా అదే షాకును కోర్టుకు కూడా ఇద్దామని చూస్తోంది. ఇప్పటివరకు ఈమె తరుపు కనీసం లాయర్‌ అనేవాడు కూడా లేకపోవడంతో, ఖచ్చితంగా అమ్మడు రాంగ్‌ స్టెప్స్‌ వేస్తోందని అర్ధమవుతోంది.

ప్రస్తుతం తెలుగులో రవితేజ బలుపు, వెంకి-రామ్‌ల గరమ్‌మసాలా సినిమాలు చేస్తున్న అంజలి, తన కెరియర్‌ను ఇంకా సంక్షభంలోకి నెట్టుకుంటుందా అంటే అవుననే అంటున్నారు. ప్రస్తుతం ఆమె తమిళనాడు కోర్టులో హాజరు కాకుండా ఎగ్గొట్టడంతో, ఈమెపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.

జూన్‌ 5న కోర్టు ముందు హాజరుకాకపోతే, అరెస్టు తీసుకురావాలని కోర్టు ఇప్పటికే ఆదేశించింది. మిస్సింగ్‌ కేస్‌ గురించే కదా కోర్టు పిలిస్తుంది, ఒకవేళ చెన్నయ్‌ వెళ్తే ప్రాణహాని ఉందన్నప్పుడు అదే విషయాన్ని వారికి చెప్పొచ్చుగా. వెళ్లి విషయాన్ని సెటిల్‌ చేసుకోకుంఆ ఇలా కోర్టులతో దాగుడుమూతలు ఆడితే ఉపయోగమేముంది అంజలి???

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు