ఎన్టీఆర్ ది బెస్ట్ ఇది కాదు-త్రివిక్రమ్

ఎన్టీఆర్ ది బెస్ట్ ఇది కాదు-త్రివిక్రమ్

జూనియర్ ఎన్టీఆర్‌తో పని చేసిన ప్రతి దర్శకుడూ అతడితో ప్రేమలో పడిపోతాడు. తారక్ నట కౌశలానికి ఫిదా అయిపోయి అతడిని ఆకాశానికెత్తేస్తుంటాడు. మామూలుగా చాలా తక్కువ మాట్లాడే త్రివిక్రమ్ సైతం ఎన్టీఆర్‌ను ఇదే తరహాలో పొగిడేస్తున్నాడు. రిలీజ్ ముంగిట ప్రమోషన్ల దగ్గర్నుంచి పోస్ట్ రిలీజ్ కార్యక్రమాల్లోనూ తారక్‌ను తెగ పొగిడేస్తున్నాడు త్రివిక్రమ్.

త్రివిక్రమ్-ఎన్టీఆర్ కలిసి రిలీజ్ తర్వాత కూడా మీడియా ఛానెళ్లలో ఇంటర్వ్యూలిస్తున్నారు. ఇందులో భాగంగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడన్న వ్యాఖ్యలతో త్రివిక్రమ్ విభేదించాడు. ఇందులోనే కాదు.. ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ తారక్ ఇచ్చింది బెస్ట్ పెర్ఫామెన్స్ కాదని త్రివిక్రమ్ అన్నాడు. అతడి బెస్ట్ పెర్ఫామెన్స్ ఇంకా రాలేదని.. భవిష్యత్తులో చూస్తామని చెప్పాడు.

ఇక ఎన్టీఆర్ కెరీర్లో ఫెయిల్యూర్ల గురించి మాట్లాడుతూ.. తారక్ సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ.. అతను మాత్రం నటుడిగా ఎప్పుడూ ఫెయిలవలేదని త్రివిక్రమ్ అన్నాడు. నటనతో పాటు ఫైట్లు, డ్యాన్సులు, కామెడీ.. ఇలా ప్రతి అంశంలోనూ ఎన్టీఆర్ ప్రతి సినిమాలోనూ ది బెస్ట్ ఇచ్చాడన్నాడు.ఎన్టీఆర్ లాంటి హీరో ఉంటే దర్శకుడికి చాలా సౌకర్యంగా ఉంటుందని.. అతను ఏకసంతాగ్రాహి అని.. కథ, పాత్ర గురించి ఒకసారి సరిగ్గా చెబితే అతను తనదైన శైలిలో చేసుకుపోతాడని.. ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తాడని త్రివిక్రమ్ కితాబిచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English