చిత్ర బృందానికి గోల్డ్ కాయిన్స్ ఇస్తుంద‌ట‌.. కండీష‌న్స్ అప్లై!

చిత్ర బృందానికి గోల్డ్ కాయిన్స్ ఇస్తుంద‌ట‌.. కండీష‌న్స్ అప్లై!

సినిమా ఒప్ప‌కున్నామో.. పాత్ర‌ను పోషించామా?  వెళ్లిపోయామా?  అన్న‌ట్లు ఉంటుంది కొంద‌రు న‌టీన‌టుల వ్య‌వ‌హారం. కానీ.. మ‌రికొంద‌రి తీరు అందుకు భిన్నం. వారితో సినిమా చేయ‌టం ఒక చ‌క్క‌టి అనుభూతిలా నిలిచిపోతుంది. త‌మ చేత‌ల‌తో వారు చుట్టూ ఉన్న వారిని ప్ర‌భావితం చేయ‌ట‌మే కాదు.. వారి ట్రీట్ మెంట్ ను ఎప్ప‌టికి మ‌ర్చిపోలేని రీతిలో ఉండేలా చేస్తారు.

వేరే సినిమా చేసినా.. వారి గుర్తుల్ని గొప్ప‌గా చెబుతుంటారు. ఇవాల్టి రోజుల్లో అలాంటి న‌టులు ఉన్నారా? అన్న ప్ర‌శ్న రావొచ్చు. కానీ కీర్తి సురేశ్ గురించి తెలిస్తే మాత్రం ఇలాంటి వారు ఇప్ప‌టికి ఉన్నారా? అనిపించ‌క మాన‌దు. తాను చేసే సినిమాలోని టీం స‌భ్యుల‌కు సినిమా పూర్తి అయ్యాక సిల్వ‌ర్ కాయిన్స్.. గోల్డ్ కాయిన్స్  ఇవ్వ‌టాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తుంటారు.

ఎలా వ‌చ్చింది ఈ అల‌వాటు?  మ‌హాన‌టిలో సావిత్రి పాత్ర‌ను పోషించిన త‌ర్వాత నుంచి ఈ అల‌వాటు వ‌చ్చిందా? అంటూ కీర్తి సురేశ్ ను అడిగితే.. ఆమె ఆస‌క్తిక‌ర విష‌యాల్ని చెప్పుకొచ్చారు. త‌మిళంలో తను చేసిన రెండో సినిమా నుంచే ఈ అల‌వాటు ఉంద‌ని చెప్పింది. మొద‌ట్లో వెండి నాణేల‌ను ఇచ్చేదానిన‌ని.. మ‌హాన‌టి త‌న కెరీర్ లోనే ప్ర‌త్యేక‌మైన సినిమా కావ‌టంతో చిత్ర బృందానికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన‌ట్లు చెప్పింది.

మ‌న‌సుకు న‌చ్చిన సినిమా అనిపించిన‌ప్పుడు గోల్డ్ కాయిన్స్ ఇస్తుంటాన‌ని న‌వ్వుతూ చెప్పేసింది. సో.. కీర్తి చేసే సినిమాల్లో ఆమెకు న‌చ్చిన‌వి.. ప్ర‌త్యేక‌మైన‌వి ఏమిట‌న్న విష‌యాన్ని ప్ర‌శ్న‌ల రూపంలో అడ‌క్క‌ర్లేదు. ఆమె చిత్ర బృందానికి గోల్డ్ కాయిన్స్ ఇస్తుందా?  సిల్వ‌ర్ కాయిన్స్ ఇస్తుందా? అన్న క్వ‌శ్చ‌న్ కు ఆన్స‌ర్ తెలుసుకుంటే స‌రిపోతుందన్న‌మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English