ఫ్లాప్‌ హీరోపై పాతిక కోట్ల బెట్‌

ఫ్లాప్‌ హీరోపై పాతిక కోట్ల బెట్‌

దిల్‌ రాజు గత రెండు సినిమాలు ఫ్లాపయినా కానీ అతని బ్యానర్‌ నుంచి వస్తోన్న కొత్త చిత్రానికి ట్రేడ్‌ పరంగా క్రేజ్‌ అయితే బాగానే వుంది. కథల పరంగా సేఫ్‌ గేమ్‌ ఆడుతోన్న దిల్‌ రాజు తన చిత్రాలకి మంచి సీజన్‌ కూడా సెట్‌ చేసుకుంటూ వుంటాడు. దసరాకి విడుదలవుతోన్న 'హలో గురూ ప్రేమ కోసమే'లో చెప్పుకోతగ్గ గొప్ప లక్షణాలేమీ కనిపించడం లేదు. హీరోనే స్వయంగా ఇది రొటీన్‌ సినిమానే కానీ వినోదాత్మకంగా వుంటుందని అనేస్తున్నాడు. ఆడియో అయితే దేవిశ్రీప్రసాద్‌ మీదే అనుమానాలు రేకెత్తించే రేంజ్‌లో ఫ్లాపయింది. రామ్‌ గత రెండు చిత్రాలు ఫ్లాప్‌ అయ్యాయి.

అనుపమకి అయితే హిట్టొచ్చి చాలా కాలమవుతోంది. ఇన్ని మైనస్‌లు కనిపిస్తున్నా కానీ ఈ చిత్రానికి బిజినెస్‌ మాత్రం పాతిక కోట్ల రేంజిలో జరిగింది. పాతిక కోట్ల వసూళ్లు తెచ్చుకోవడం అంత వీజీ కాదని 'శైలజారెడ్డి అల్లుడు', 'నోటా' చిత్రాలతో రుజువయింది. ఆ రెండు చిత్రాలు ఫ్లాప్‌ టాక్‌తో ఎంతో దూరం వెళ్లలేకపోయాయి. పండగ అడ్వాంటేజ్‌ క్యాష్‌ చేసుకున్నా కానీ 'శైలజారెడ్డి అల్లుడు' చాలా త్వరగా తేలిపోయింది. అందుకే బిజినెస్‌ పరంగా ఇది పెద్ద రిస్కే అని చెప్పాలి. మార్కెట్లో 'అరవింద సమేత' ఇంకా ఫ్రెష్‌గా వుండగా, పోటీగా 'పందెంకోడి 2' లాంటి మాస్‌ సినిమా విడుదలవుతుండగా, పాతిక కోట్లు పలికిన 'హలోగురూ ప్రేమకోసమే' బయ్యర్లకి లాభాల పంట పండిస్తుందో లేక ఆశలకి మంట పెడుతుందో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English