వీరభోగ వసంత రాయలు.. సుధీర్‌తో గొడవేంటి?

వీరభోగ వసంత రాయలు.. సుధీర్‌తో గొడవేంటి?

సోమవారం సాయంత్రం రిలీజైన ‘వీర భోగ వసంత రాయలు’ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఓ కొత్త తరహా సినిమా చూడబోతున్న ఫీలింగ్ ఈ ట్రైలర్ కలిగించింది. ఐతే ట్రైలర్లో అన్నీ బాగున్నాయి కానీ.. సుధీర్ బాబు వాయిస్ దగ్గరే తేడా కొట్టేసింది. ఆ పాత్రకు ఇంకెవరో డబ్బింగ్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సుధీర్ పాత్రకు ఇంకెవ్వరితోనే డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందా అన్న డిస్కషన్ మొదలైంది. దీనిపై మీద పెద్ద చర్చ జరుగుతుండటంతో సుధీర్ బాబు లైన్లోకి వచ్చాడు. ‘వీర భోగ వసంత రాయలు’ ట్రైలర్లో వినిపించిన వాయిస్ తనది కాదని అంగీకరించాడు. ఈ సినిమాలో తన పాత్రకు కొన్ని కారణాల వల్ల డబ్బింగ్ చెప్పుకోలేకపోయానని.. ఆ కారణాలేంటన్నది వివరించలేనని సుధీర్ చెప్పాడు. ఈ చిత్రంలో సుధీర్ పోలీస్ పాత్రలో కొంచెం కొత్తగా కనిపించాడు.

నిజానికి ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రాన్ని సుధీర్ చాలా ప్రతిష్టాత్మకంగా భావించాడు. ఈ సినిమా గురించి.. ఇందులో తన పాత్ర గురించి.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఇంద్రసేన గురించి గతంలో అతను గొప్పగా చెప్పాడు. తెలుగులో ఇది ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందని చెప్పడంతో పాటు ఇంద్రసేన టాలీవుడ్ క్రిస్టఫర్ నోలన్ అని కూడా అతను కితాబిచ్చాడు. అంత ప్రత్యేకంగా భావించిన సినిమాలో తన పాత్రకు సుధీర్ డబ్బింగ్ చెప్పకపోవడమేంటన్నది అర్థం కావడం లేదు. బహుశా ఈ మల్టీస్టారర్ మూవీలో తన పాత్రకు ప్రాధాన్యం తగ్గిందని అలిగి ఏమైనా ఇలా చేశాడేమో తెలియదు మరి. ఈ మధ్య ఈ చిత్రాన్ని అతను ప్రమోట్ చేయకపోవడం కూడా సందేహాలకు తావిస్తోంది. మరి చిత్ర బృందం ఈ విషయంలో ఏమంటుందో.. మొత్తం సినిమాలో వేరొకరి వాయిస్‌తో సుధీర్ పాత్రను చూసిన జనాలు ఎలా స్పందిస్తారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English