పెనివిటి పాట.. సునీల్ చెప్పిన కామెడీ కథ

పెనివిటి పాట.. సునీల్ చెప్పిన కామెడీ కథ

‘అరవింద సమేత’ సినిమాలోని పెనివిటి సాంగ్ ఎంత పాపులరైందో తెలిసిందే. ఈ పాట ఇన్‌స్టంట్‌గా హిట్టయింది. ఇందులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యంపై ప్రశంసల జల్లు కురిసింది. ఈ పాట తనకెంతో ఇష్టమని చెప్పిన త్రివిక్రమ్.. దాని నేపథ్యం గురించి కూడా ఇంతకుముందే ఇంటర్వ్యూల్లో వివరించాడు. ఐతే ఇప్పుడు త్రివిక్రమ్ మిత్రుడు సునీల్ లైన్లోకి వచ్చాడు. ఈ పాట ఎలా పుట్టిందో కామెడీగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఒకప్పుడు త్రివిక్రమ్‌ను ఉద్దేశించి తాను పాడుకునే పాట ఇదని సునీల్ చెప్పడం విశేషం. ఇంకా సునీల్ ఈ పాట గురించి ఏమన్నాడో అతడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘అరవింద సమేత సినిమాలో నా క్యారెక్టర్ పేరు నీలాంబరి. ఈ పేరు పెట్టడానికి కారణం.. నేను, త్రివిక్రమ్ రూమ్‌లో కలిసి ఉన్నప్పుడు వంట చేయడం.. రూం తుడవటం.. త్రివిక్రమ్ రెడీ అయ్యేటప్పటికీ సూట్‌ కేస్ రెడీ చేసి పక్కన పెట్టడం లాంటివి చేసేవాణ్ని. ఇక పెనివిటి పాట ఐడియా ఎలా వచ్చిందో తెలుసా? రూం నుంచి బయలుదేరి త్రివిక్రమ్ చెన్నై వెళ్లాడు. ఫోన్ లేదు... వారం రోజులైపోయింది. నా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. వీడు వస్తాడా? ఇంటికొస్తాడా? వేళకీ తిన్నాడా? పడుకున్నాడా? ఆరోగ్యం ఎలా ఉందో అనుకుని త్రివిక్రమ్ కోసం ఎదురు చూశా. అందుకే దేవుడు నా ఆత్మను పెన్నులో ఇంకులా చేసి ఈ పాట రాయడానికి అవకాశం కల్పించాడు’’ అని సునీల్ చమత్కారంగా చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English