కేరళలో ఆ సినిమా ప్రకంపనలు

కేరళలో ఆ సినిమా ప్రకంపనలు

కేరళలో అతి పెద్ద ఫిలిం స్టార్ మోహన్ లాల్. ఇక అక్కడి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ కథానాయకుడు నివిన్ పౌలీ. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే దానికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పేదేముంది? ఈ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే ‘కాయంకులం కొచున్ని’ సినిమా కేరళలో ప్రకంపనలు రేపుతోంది.

కేరళ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని స్థాయికి దీనికి ఓపెనింగ్స్ వస్తున్నాయి. కేరళ చిన్న రాష్ట్రం. తెలుగు రాష్ట్రాల్లో మాదిరి వేల థియేటర్లు ఉండవు. మన దగ్గర పెద్ద సినిమాల్ని దాదాపు 1500 థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. అక్కడ ‘కాయంకులం కొచున్ని’ చిత్రాన్ని 300 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇదే రికార్డు. ఇక వసూళ్ల సంగతి చూస్తే తొలి రోజు కేరళలో రూ.5.5 కోట్లతో కొత్త రికార్డులు నెలకొల్పిందా చిత్రం. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.16 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది. ఇది కూడా రికార్డు.

గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా.. వారాంతపు వసూళ్ల విషయంలోనూ కొత్త రికార్డులు నమోదవడం ఖాయంగా ఉంది. మోహన్ లాల్ సినిమా ‘పులి మురుగన్’ రికార్డుల్ని ఒక్కొక్కటిగా బద్దలు కొట్టుకుంటూ వెళ్తోందీ చిత్రం. ఐతే ‘కాయంకులం కొచున్ని’లో లాల్‌ది పూర్తి స్థాయి పాత్రేమీ కాదు. ఆయన క్యామియో రోల్ చేశాడు. కానీ అది బాగా పేలింది. ‘లీడర్’ భామ ప్రియా ఆనంద్ కథానాయికగా చేసింది. ప్రముఖ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

నివిన్ పౌలీ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కించిన చారిత్రక చిత్రమిది. సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్ల మోత మోగిపోతోంది. ‘కార్నివాల్ సినిమాస్’ మల్టీప్టెక్స్.. కేరళ వ్యాప్తంగా 19 లొకేషన్లలోని 52 స్క్రీన్లలో తొలి రోజు నిర్విరామంగా షోలు వేయడం విశేషం. తొలి రోజే ఆ సంస్థ 200కు పైగా షోలు ప్రదర్శించింది. ఇప్పటిదాకా ఇండియాలో ఏ సినిమా కూడా 24 గంటల పాటు నిర్విరామంగా నడవలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English