అరవింద సమేత.. టెన్షన్ పన్లేదబ్బా

అరవింద సమేత.. టెన్షన్ పన్లేదబ్బా

జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివసా్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అరవింద సమేత’ భారీ అంచనాల మధ్య విడుదలై దానికి తగ్గట్లే కళ్లు చెదిరే వసూళ్లు రాబట్టింది. రూ.26.6 కోట్ల షేర్‌తో నాన్-బాహుబలి రికార్డు నెలకొల్పింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనూ సినిమా అదరగొట్టింది.

ఐతే రెండో రోజు ఈ చిత్రానికి వసూళ్లు తగ్గాయి. రూ.8 కోట్ల మేర షేర్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఐతే ఈ వసూళ్లు చూపించి సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం మొదలైంది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు సగం వసూళ్లయినా రావాలి కదా.. తొలి రోజుతో పోలిస్తే మూడింట ఒక వంతు కూడా షేర్ రాలేదే అనే ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు జనాలు. అంతే కాక శుక్రవారం ‘అరవింద సమేత’కు చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడకపోవడాన్ని కూడా ఎత్తి చూపుతున్నారు.

కానీ ‘అరవింద సమేత’ రిలీజైంది గురువారం అన్న సంగతి మరిచిపోకూడదు. మామూలుగా కొత్త సినిమాలు శుక్రవారం రిలీజవుతాయి. శనివారం వీకెండ్ కాబట్టి టాక్‌ను బట్టి రెండో రోజు కూడా వసూళ్లు బాగుంటాయి. గురువారం రిలీజయ్యే సినిమాలకు శుక్రవారం మామూలుగానే కొంచెం ఎక్కువ డ్రాప్ ఉంటుంది. పైగా దసరా సెలవులు ఇప్పుడే మొదలైన నేపథ్యంలో జనాలు ప్రయాణాల్లో ఉంటారు. ఇంకా ఊర్లకు వెళ్లి సెటిలై ఉండరు. ఈ ప్రభావంతో శుక్రవారం వసూళ్లు తగ్గి ఉండొచ్చు.

కానీ శనివారం సినిమా మళ్లీ పుంజుకుంది. ఈ రోజు దాదాపుగా అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ కనిపిస్తున్నాయి. శుక్రవారం కంటే శనివారం వసూళ్లు ఎక్కువ ఉన్నా ఉండొచ్చు. ఆదివారం కూడా జోరు కొనసాగడం ఖాయం. దసరా సెలవులే కాబట్టి వీక్ డేస్‌లో కూడా ‘అరవింద సమేత’ మంచి షేర్ రాబట్టడానికి అవకాశముంది. రెండో వారాంతంలో కూడా సినిమాకు హౌస్ ఫుల్స్ పడొచ్చు. కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English