నాగ చైతన్య మళ్లీ అదే మిస్టేక్‌

  నాగ చైతన్య మళ్లీ అదే మిస్టేక్‌

ఎంత మంచి సినిమా చేసామనే దానికంటే దానిని ఎంత మంచి టైమ్‌లో విడుదల చేసామనేది చాలా ఇంపార్టెంట్‌. ఏ చిత్రమయినా మొదటి వారాంతాం దాటి ఎక్కువ వసూలు చేయలేకపోతున్న టైమ్‌లో ఫస్ట్‌ వీకెండ్‌ కలిసొచ్చేలా చూసుకోవడం మస్ట్‌.

రీసెంట్‌గా వినాయక చవితికి 'శైలజారెడ్డి అల్లుడు' విడుదల చేయడం వల్ల నాగచైతన్యకి చాలానే హెల్పయింది. ఆ చిత్రం మొదటి రోజు ఏడు కోట్ల షేర్‌ రాబట్టుకుంది. ఓవరాల్‌గా ఫ్లాప్‌ అయినప్పటికీ మొదటి రోజు వసూళ్ల వల్ల నష్టాలు కాస్త తగ్గాయి. కానీ తన మలి చిత్రం 'సవ్యసాచి' విషయంలో నాగచైతన్య మిస్టేక్‌ చేస్తున్నాడు.

ఇప్పటికే డిలే అయిన ఈ చిత్రాన్ని ఆఫ్‌ సీజన్‌ అయిన నవంబర్‌లో విడుదల చేస్తున్నారు. హాలిడేస్‌ లేని టైమ్‌లో విడుదల చేయడం వల్ల ఈ చిత్రం ఎంత బాగున్నా వసూళ్లు తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతుంది. గతంలో ఇలాగే 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాన్ని సాగతీసి సాగతీసి వసూళ్లు వుండని టైమ్‌లో విడుదల చేసి చేతులు కాల్చుకున్నారు.

సవ్యసాచికి కూడా మంచి డేట్‌ కుదర్లేదు. ఇంకా డిలే చేస్తే పెద్ద సినిమాలతో పోటీ పడాల్సి వస్తుందని రిస్కు చేస్తున్నారు. సినిమా అద్భుతంగా వుందనే టాక్‌ వస్తే తప్ప ఈ టైమ్‌లో గట్టెక్కడం కష్టమవుతుందనేది ట్రేడ్‌ మాట. ప్లానింగ్‌ పరంగా నాగచైతన్య ఇంకా చాలా నేర్చుకోవాల్సి వుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English