హద్దు దాటుతోన్న సింగర్‌ చిన్మయి

హద్దు దాటుతోన్న సింగర్‌ చిన్మయి

ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ చిన్మయి డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా పాపులరే. సమంతకి డబ్బింగ్‌ చెప్పేది ఈవిడే. నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ భార్య అయిన చిన్మయి 'మీటూ' ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తోంది. ముందుగా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలని ఏకరవు పెట్టిన చిన్మయి తర్వాత సరాసరి తమిళ చిత్ర సీమలోని లెజెండ్స్‌నే టార్గెట్‌ చేసింది.

జాతీయ పురస్కారం అందుకున్న పద్మభూషణ అవార్డ్‌ గ్రహీత, గేయ రచయిత వైరముత్తుపై సెక్సువల్‌ అబ్యూజ్‌ ఆరోపణలు చిన్మయి చేసింది. అతను నడిపే లేడీస్‌ హాస్టల్‌లో అమ్మాయిలకి భద్రత లేదని ఆమె ఆరోపించింది. అంతటితో ఆగకుండా తనకి తమ కష్టాలు తెలిపే అందరు అమ్మాయిల కథలని ట్వీట్‌ చేస్తూ చాలా మంది ప్రముఖుల పేర్లు బయట పెట్టింది.

తనకి జరిగిన అనుభవాల గురించి మాట్లాడ్డం వరకు ఓకే కానీ ఎవరో అపరిచితులు, పేరు చెప్పడానికి ఇష్టపడని వాళ్లు చెప్పే వాటిని నమ్మేస్తూ ప్రముఖులని టార్గెట్‌ చేయడమే ఆశ్చర్య పరుస్తోంది. ఇంతకు ముందెప్పుడూ ఎలాంటి వివాదాల్లోకి రాని చిన్మయి ఈ విషయంలో ఎందుకు ఇంతగా రియాక్ట్‌ అవుతోందనేది అంతు చిక్కడం లేదు. పెద్దల పేర్లని ఇలా బయటకి లాగుతూ చివరకు తన వద్ద ఆధారాలు లేకపోతే ఆమె చాలా పర్యవసానాలు ఫేస్‌ చేయాల్సి వస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English