బన్నీ బెంగ తీర్చిన అరవింద!

బన్నీ బెంగ తీర్చిన అరవింద!

'నా పేరు సూర్య' పరాజయం పాలవడంతో అల్లు అర్జున్‌ డిఫెన్స్‌లో పడిపోయాడు. వరుసపెట్టి మాస్‌ చిత్రాలు చేయడంతో అల్లు అర్జున్‌ మార్కెట్‌ బాగా ఎఫెక్ట్‌ అయింది. దీంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఏదైనా చేయాలని చూస్తున్నాడు. ఎంతమంది కథలు చెప్పినా అల్లు అర్జున్‌ శాటిస్‌ఫై అవలేదు.

'మనం' దర్శకుడు చెప్పిన ఒక లైన్‌ ఓకే చేసిన అల్లు అర్జున్‌ ఆ చిత్రానికి అతను రాసిన ఫస్ట్‌ హాఫ్‌ కూడా బాగుందని చెప్పాడట. అయితే సెకండ్‌ హాఫ్‌కి ఇంతవరకు విక్రమ్‌ పదిహేను వెర్షన్లు వినిపిస్తే ఏదీ నచ్చలేదట. అందుకే ఆ చిత్రాన్ని ఇంకా కన్‌ఫర్మ్‌ చేయలేదు. ఈలోగా త్రివిక్రమ్‌ సినిమా 'అరవింద సమేత' ఫలితం కోసం ఎదురు చూసాడు. ఫ్యామిలీ సినిమా అయితే త్రివిక్రమ్‌ కంటే బెటర్‌ ఆప్షన్‌ లేదని బన్నీకి తెలుసు.

అయితే 'అజ్ఞాతవాసి' తర్వాత మరో ఫ్లాప్‌ ఇస్తే త్రివిక్రమ్‌ మార్కెట్‌ ఎఫెక్ట్‌ అవుతుంది. ఈ భయంతోనే సినిమా విడుదలయ్యే వరకు ఎదురు చూసాడు. టాక్‌ బాగా రావడంతో, బంపర్‌ ఓపెనింగ్స్‌ రావడంతో త్రివిక్రమ్‌ మార్కెట్‌కి ఏమీ కాలేదని తెలుసుకుని అతనితో సినిమా చేయడానికి బన్నీ ఉత్సాహంగా వున్నాడు. ఆల్రెడీ అతని వైపు నుంచి త్రివిక్రమ్‌కి కాల్‌ వెళ్లిందట. కానీ త్రివిక్రమ్‌ రెండు నెలల సమయం అడిగాడట.

ప్రస్తుతానికి తన వద్ద ఏ కథ సిద్ధంగా లేదని, ఒకసారి లైన్‌ రెడీ అయ్యాక మాట్లాడతానని చెప్పాడట. అందుకే త్రివిక్రమ్‌ తదుపరి చిత్రం గురించి మీడియాతో కూడా ఏమీ మాట్లాడ్డం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English