శ్రీరెడ్డి దెబ్బకు టాలీవుడ్ గప్ చుప్

శ్రీరెడ్డి దెబ్బకు టాలీవుడ్ గప్ చుప్

‘మి టు’ మూమెంట్ ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్లో రోజుకో సెలబ్రెటీ సంచలన ఆరోపణలతో మీడియా ముందుకొస్తోంది. ఈ మూమెంట్లో కొందరు ప్రముఖుల బాగోతాలు బయటికి వచ్చాయి. వారి కెరీర్లే తల్లకిందులు అయిపోతున్నాయి.

మరోవైపు కోలీవుడ్లో సైతం ‘మి టు’ మూమెంట్ గట్టిగా నడుస్తోంది. సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె తనకు ఎదురైన ఇబ్బందులతో పాటు వేరే అమ్మాయిల కథల్ని కూడా వెలుగులోకి తెస్తోంది.

ఐతే ఈ సమయంలో టాలీవుడ్ జనాలు మాత్రం సైలెంటుగా ఉంటున్నారు. ఇక్కడ ఏ అమ్మాయీ ఆరోపణలు చేయట్లేదు. వేరే ఇండస్ట్రీల వాళ్ల ఆరోపణల మీదా స్పందించట్లేదు. చిన్మయి తన స్నేహితురాలు కాబట్టి సమంత రెస్పాండయింది. ఇంకో ఇద్దరు ముగ్గురు మొక్కుబడిగా మెసేజ్‌లు పెట్టారు.

ఐతే ఈ ‘మి టు’ ఉద్యమానికి ముందుగా ఇండియాలో మద్దతు వచ్చింది టాలీవుడ్ నుంచే. శ్రీరెడ్డి కొన్ని నెలల కిందటే ఎంతటి తీవ్రమైన ఆరోపణలు చేసిందో గుర్తుండే ఉంటుంది. ముందు ఆమెను లైట్ తీసుకున్నప్పటికీ తర్వాత పరిస్థితులు మారాయి. ఆమెకూ మద్దతు లభించింది. ఇండస్ట్రీ జనాలు ఆమె విషయంలో భయపడ్డారు. ఆమెకు మద్దతుగా మహిళా సంఘాలు వచ్చాయి.

పలువురు జూనియర్ ఆర్టిస్టులు కూడా తోడయ్యారు. ఒక సమయంలో ఈ ఉద్యమం సరైన దారిలోనే నడుస్తున్నట్లు అనిపించింది. ఇండస్ట్రీకి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్‌ను శ్రీరెడ్డి అనవసరంగా బూతు మాట అందో అంతటితో ఈ ఉద్యమం పక్కదారి పట్టింది. ఇష్యూ డైవర్ట్ అయింది. దీంతో శ్రీరెడ్డిపై వ్యతిరేకత పెరిగి.. ఆమె చేసే ఆరోపణలకు విలువ లేకుండా పోయింది.

 శ్రీరెడ్డి ఎప్పట్లాగే ఆరోపణలు.. విమర్శలు కొనసాగిస్తూ వాటిని జనాలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతటా చాలా వరకు జెన్యూన్‌గా ‘మి టు’ ఉద్యమం ఉద్ధృతంగా నడుస్తోంది. ఈ టైంలో మన పరిశ్రమ నుంచి స్పందనే లేదు. అందరూ గప్ చుప్ అన్నట్లుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English