ఒకటైపోయింది.. మూడు గ్యారెంటీ

ఒకటైపోయింది.. మూడు గ్యారెంటీ

జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో నిన్నటి నుంచి బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తున్న ప్రకంపనలు చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకోవడంతో రికార్డుల వేట షురూ అయింది.

తెలుగు రాష్ట్రాల్లో నాన్-బాహుబలి రికార్డులపై ఈ చిత్రం కన్నేసింది. మరోవైపు అమెరికాలో ఈ చిత్రం సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం ప్రిమియర్లతోనే ‘అరవింద సమేత’ 8 లక్షల డాలర్లు కొల్లగొట్టడం విశేషం. గురువారం మిలియన్ మార్కును దాటడానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ ఊపు చూస్తే వీకెండ్ అయ్యేసరికే 2.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత కూడా సినిమా జోరు కొనసాగితే 3 మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడమూ లాంఛనమే.

ఐతే ఆ మార్కును దాటి సినిమా ఎక్కడిదాకా వెళ్తుందన్నది ఆసక్తికరం. ఈ ఏడాదే వచ్చిన ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’ కొంచెం అటు ఇటుగా 3.5 మిలియన్ డాలర్ల దగ్గర ఉన్నాయి. వీటిని దాటి నాన్-బాహుబలి రికార్డును ‘అరవింద సమేత’ అందుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరం. ఇది వచ్చే వారం రాబోయే ‘హలో గురూ ప్రేమ కోసమే’ ఫలితాన్ని బట్టి కూడా ఆధార పడి ఉండొచ్చు. తారక్‌కు మొత్తంగా అమెరికాలో ఇది ఆరో మిలియన్ డాలర్ మూవీ కాగా.. వరుసగా ఐదోది కావడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English