#metoo.. భార్య ముందే దర్శకుడి చెంపచెల్లు

#metoo.. భార్య ముందే దర్శకుడి చెంపచెల్లు

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ‘మి టు’ జ్వాలలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకూ ఈ ఉద్యమం ఉద్ధృతి పెరుగుతోంది. ఇంతకుముందు లాగా ఒక అమ్మాయి ఆరోపణలు చేయడం.. అవతలి వాళ్లు లైట్ తీసుకోవడం.. మిగతా జనాలు సైలెంటుగా వినోదం చూడటం.. ఇలా లేదు ఇప్పుడు వ్యవహారం. ఆరోపణలకు మద్దతుగా గళం పెరుగుతోంది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లకు సినీ పరిశ్రమ నుంచి సహాయ నిరాకరణ జరుగుతోంది. నోటీసులు వస్తున్నాయి. కేసులు నమోదవుతున్నాయి. విచారణకు సిద్ధ పడాల్సి వస్తోంది. ‘క్వీన్’ దర్శకుడు వికాస్ బల్ జీవితం ఓ అమ్మాయి చేసిన  ఆరోపణలతో ఎలా తల్లకిందులైందో అందరూ చూస్తూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్లో మరో ప్రముఖ దర్శకుడు ‘మి టు’ ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. అతనే సుభాష్ కపూర్.

‘ఫస్ గయారే ఒబామా’.. ‘జాలీ ఎల్ఎల్బీ’.. ‘జాలీ ఎల్ఎల్బీ-2’ లాంటి మంచి చిత్రాలు అందించిన సుభాష్ మీద గీతిక త్యాగి సంచలన ఆరోపణలతో మీడియా ముందుకొచ్చింది. గతంలోనే సుభాష్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గీతిక.. ఇప్పుడు మరోసారి అతడి పేరు తెరమీదికి తెచ్చింది. దీంతో సుభాష్‌ డైరెక్ట్ చేసిన ‘మొఘల్’ చిత్రం నుంచి అతడిని తప్పించే పరిస్థితి వచ్చింది. ఈ సినిమాలో భాగస్వామి అయిన అమీర్ ఖాన్ సంస్థ దీన్నుంచి తప్పుకుంది.

సినిమానే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. విశేషం ఏంటంటే.. ఇంతకుముందు సుభాష్‌పై గీతిక ఆరోపణలు చేసిన సమయంలో అతడితో పాటు తన భార్యను కూడా ఒక స్టూడియోకు రప్పించింది గీతిక. ఆ సందర్భంగా సుభాష్ భార్య చూస్తుండగానే అతడి చెంప చెల్లుమనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది చూశాక సుభాష్ తప్పు చేసే ఉంటాడని జనాలు నమ్ముతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు