1000 కోట్ల సినిమా.. రైటర్ ఔట్

1000 కోట్ల సినిమా.. రైటర్ ఔట్

మహాభారత కథను భీముడి కోణంలో చెప్పే ఓ కథతో రూ.100 కోట్ల ఖర్చుతో మలయాళంలో ఓ సినిమా రాబోతున్నట్లు కొన్నేళ్ల కిందట ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మలయాళ దర్శకుడు శ్రీ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేశాడు. యూఏఈకి చెందిన వ్యాపార వేత్త బీఆర్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాడు.

భీష్ముడి దృక్కోణంలో మహాభారతం ఆధారంగా ‘రండమూలం’ అనే నవల రాసిన వాసుదేవ్ మీనన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందించాడు. ఆయన చిత్ర బృందానికి స్క్రిప్టు అందించి నాలుగేళ్లవుతోంది. కానీ ఇప్పటిదాకా ఈ చిత్రం పట్టాలెక్కనే లేదు. దీంతో ఆయనకు కోపం వచ్చింది. తాను ఈ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చేయడానికి సిద్ధపడ్డ ఆయన.. తన స్క్రిప్టు కూడా వెనక్కి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.

చిత్ర బృందానికి నాలుగేళ్ల ముందు తాను స్క్రిప్టు ఇచ్చి.. మూడేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నానని.. ఐతే మూడేళ్ల తర్వాత ఒక ఏడాది ఒప్పందాన్ని పొడిగించానని.. ఐతే ఇప్పటికీ ఈ సినిమా మొదలే కాలేదని.. ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియదని.. అలాంటపుడు తన స్క్రిప్టు తనకు ఇచ్చేయాలని వాసుదేవన్ అన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు. మరి ఈ వ్యవహారంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English