#metoo మలింగ అమ్మాయిని గదిలోకి లాగి..

 #metoo మలింగ అమ్మాయిని గదిలోకి లాగి..

ఇండియాలో ఫిలిం ఇండస్ట్రీతో పాటు వివిధ రంగాల్ని కుదిపేస్తున్న ‘మి టు’ ఉద్యమం.. శ్రీలంకనూ తాకింది. ఆ దేశానికి చెందిన లెజెండరీ క్రికెటర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఐతే వారిపై ఆరోపణలు చేస్తోంది భారత అమ్మాయిలు కావడం గమనార్హం. శ్రీలంకకు ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్‌గా ఎంతో గౌరవం సంపాదించుకున్న అర్జున రణతుంగపై నిన్ననే ఈ ఆరోపణలు వచ్చాయి.

కొన్నేళ్ల క్రితం ముంబయి హోటల్లో రణతుంగ తనను లైంగికంగా వేధించాడని ఓ భారత ఎయిర్‌ హోస్టెస్‌ ఆరోపించింది. అతడు తనతో ఎంత దారుణంగా ప్రవర్తించాడో ఆమె ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో వివరించింది. అనుకోకుండా అతనున్న హోటల్‌కు వెళ్లిన తనను పట్టుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ఈ విషయం బయటపడ్డ మరుసటి రోజే అదే దేశానికి చెందిన లసిత్ మలింగ మీదా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.

మలింగ చేతిలో వేధింపులకు గురైన ఓ బాధితురాలి ఉదంతాన్ని చిన్మయి ట్విట్టర్లో వెల్లడించింది. ‘ముంబైలోని ఓ హోటల్‌లో ఆ ఘటన జరిగింది. కొన్నేళ్ల కిందట ఐపీఎల్ జరుగుతున్న సమయంలో హోటల్‌కు వెళ్లాను. లంక క్రికెటర్ లసిత్ మలింగ గదిలో నా స్నేహితురాలు ఉందని చెప్పారు. ఫ్రెండ్ కోసం వేచిచూస్తున్న నేను మలింగ గదికి వెళ్లగా అక్కడ ఆమె లేదు. మలింగ వెంటనే నన్ను బెడ్ మీదకు తోసేసి అసభ్యంగా తాకాడు.

మలింగ నన్ను ఆక్రమించుకుంటుండగా అతడితో పోరాడలేక కళ్లు మూసుకున్నాను. అతను నా ముఖాన్ని ఉపయోగించుకున్నాడు. ఇంతలో హోటల్ సిబ్బంది రావడంతో మలింగ వెళ్లి డోర్ తీశాడు. నేను వెంటనే వాష్‌రూమ్‌కు వెళ్లి ముఖం కడుక్కుని బయట పడ్డాను’ అని ఆ పోస్టులో బాధితురాలు పేర్కొంది. ఈ బాధితురాలి పేరు వెల్లడించని చిన్మయి.. ఆమె ఒక లేడీ జర్నలిస్టుతో ఈ ఘటనపై వివరంగా మాట్లాడబోతున్నట్లు వెల్లడించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English