బన్నీ ఇక ఫిక్సయిపోవచ్చు

బన్నీ ఇక ఫిక్సయిపోవచ్చు

టాలీవుడ్లో మిగతా స్టార్ హీరోలందరూ సినిమాల విషయంలో వేగం పెంచారు కానీ.. అల్లు అర్జున్ బండి మాత్రం కొంచెం నెమ్మదిగానే సాగుతోంది. అతను ఏ సినిమానూ ఒక పట్టాన తేల్చడని పేరుంది. మిగతా హీరోలు ఒక సినిమా చేస్తుండగానే.. మరో సినిమా కథ ఓకే చేసి.. ఇది పూర్తవగానే అది మొదలుపెట్టేస్తుంటారు.

కానీ బన్నీ ఒక సినిమా చేస్తుండగా.. ఇంకో సినిమా కన్ఫమ్ చేయడు. ఒకటి పూర్తయ్యాకే వేరే దాని గురించి ఆలోచిస్తాడు. అతడి తండ్రి అల్లు అరవింద్.. స్నేహితుడు బన్నీ వాసు.. ఇంకా కొందరు కలిసి ఓకే చేస్తేనే సినిమా పట్టాలెక్కుతుంది. ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ కథను ఇలాగే చాలామంది పరిశీలించి పరిశీలించి.. చివరికి అతడికి హ్యాండిచ్చేశారు.

తన ఇమేజ్‌కు సరిపడని కథ అంటూ దాన్ని పక్కన పెట్టేసిన బన్నీ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద కన్నేసినట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఐతే ‘అజ్నాతవాసి’తో కంగుతిన్న త్రివిక్రమ్ ‘అరవింద సమేత’తో ఎలా పెర్ఫామ్ చేస్తాడో అని వెయిట్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఐతే ఇప్పుడు ‘అరవింద సమేత’ రిలీజైపోయింది. మంచి టాకే తెచ్చుకుంది. కళ్లు చెదిరే ఓపెనింగ్స్ కూడా రాబట్టేలా కనిపిస్తోంది. మొత్తానికి త్రివిక్రమ్ మళ్లీ ఫామ్ అందుకున్నాడనడంలో సందేహం లేదు. మరి బన్నీ.. త్రివిక్రమ్‌తో మూడో సినిమాకు రెడీ అయ్యాడని అనుకోవచ్చా? మరి కథ విషయంలో వీరి మధ్య అంగీకారం కుదురుతుందా? ఈసారి వీళ్లిద్దరు ఎలాంటి సినిమాతో పలకరిస్తారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English