‘అరవింద’లో ఇంకో ఫైట్ అనుకున్నారట కానీ..

‘అరవింద’లో ఇంకో ఫైట్ అనుకున్నారట కానీ..

పెద్ద హీరో సినిమా అన్నాక క్లైమాక్స్‌లో కచ్చితంగా భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉండాల్సిందే. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి డైరెక్టర్ జత కడితే కచ్చితంగా పతాక సన్నివేశంలో యాక్షన్ ఆశిస్తాం. కానీ ‘అరవింద సమేత’ క్లైమాక్స్‌లో మాత్రం ఫైట్ పెట్టలేదు. ఎమోషనల్ సీన్లతోనే సినిమాను ముగించారు.

ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కూడా. ఐతే నిజానికి తాము పతాక సన్నివేశం కోసం ఒక యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేసుకున్నట్లు త్రివిక్రమ్ చెప్పాడు. కానీ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ సూచన మేరకు ఆ ఆలోచనను విరమించుకున్నట్లు అతను వెల్లడించాడు.

గురువారం సాయంత్రం ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్లో ఈ విషయం చెప్పాడు త్రివిక్రమ్. ‘‘సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ బాగున్నాయంటే అందుకు కారణం రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్లే. మేం ప్లాన్‌ చేసిన సీక్వెన్స్‌లను అద్భుతంగా ఎగ్జిక్యూట్‌ చేశారు. వాళ్లు ఫైట్‌ మాస్టర్లు కాదు.. కథలో ఓ భాగాన్ని డైరెక్ట్‌ చేసే స్థాయికి వాళ్లు చేరుకున్నారు. ఎన్టీఆర్‌తో క్లైమాక్స్‌లో ఓ యాక్షన్‌ ఏపిసోడ్‌ అనుకుని చేశాం కూడా. అయితే అది వద్దని చెప్పిన రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్‌.. డైలాగ్స్ మీదే క్లైమాక్స్ చేస్తే బాగుంటుందన్నారు. ఆ విషయంలో వారికి థ్యాంక్స్‌ చెప్పాలి. యాక్షన్ ఎపిసోడ్ల కంటే హీరో.. విలన్‌కి సారీ చెప్పడమే ఈ సినిమాకు బి,సి సెంటర్లలో మంచి ఆదరణ దక్కేలా చేస్తోంది’’ అని త్రివిక్రమ్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English